ఈ జాగా మాదే…

jnj c 2
jnj in 1

దాదాపు 16 ఏళ్ల తీరని కల. 2007 లో అప్పటి ప్రభుత్వం కేటాయించిన భూములపై కొండంత ఆశ. ఎప్పటికైనా దక్కకపోతుందా అనే గట్టి నమ్మకం. సుధీర్ఘ ఎదురుచూపులు. చివరకు హైదరాబాద్ విలేకర్లకు ఇళ్ళ స్థలాలు ఇవల్సిందే అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో తమ సమస్య పరిష్కారం అయినట్టే అన్న నిట్టూర్పు. కానీ “సుప్రీం” తీర్పు ఇచ్చి ఏడాది గడుస్తున్నా అతీ గతీ లేదు. విన్నపాలు, పోరాటాలను పట్టించుకున్న నాధుడే లేడు. ప్రభుత్వం ఎవరికో మేలు చేయాలనే అనాలోచిత చర్యల మధ్య న్యాయంగా జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అందజేయాల్సిన భూమిని ప్రభుత్వం తోక్కిపెడుతోందనే బలమైన విమర్శలు పుట్టుకొస్తున్నాయి. ఒకవైపు జిల్లాల్లో స్థలాలు ఇస్తూ కేవలం ఒక్క హైదరాబాద్ విలేకరుల విషయంలోనే ఎందుకు జాప్యం చేస్తోదనే వాదనలు తలెత్తుతున్నాయి. చివరికి జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ సభ్యులు రోడ్డు మీదకు వచ్చి తమకు న్యాయం చేయండని ఆర్జించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొంత కాలంగా జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ సభ్యుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఒక వర్గం ఏకంగా సొసైటీ అసమర్ధత కారణంగానే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ కమిటీ కి నాయకత్వం వహిస్తున్న క్రాంతి కిరణ్ ఎం.ఎల్.ఏగా, పల్లె రవికుమార్ గౌడ కార్పోరేషన్ చైర్మన్ గా ఉండడం వల్ల సమస్యని వారు ముఖ్యమంత్రి వద్ద చర్చించలేక పోతున్నరనే అసంతృప్తి కూడా ఉంది. ఈ నేపధ్యంలో ఈ రోజు జరిగే జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం కీలకంగా మారింది. కమిటీ లోపమా, ప్రభుత్వ నిర్లక్ష్యమా లేక ఒక ముఠా ఒత్తిడా అనే అనుమానాల పై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటాయించిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల స్థలాన్ని హౌసింగ్ సొసైటికి ప్రభుత్వం ఎందుకు అప్పజేప్పడం లేదనేది ప్రధాన ఎజెండాగా చేపట్టనున్నారు. ప్రభుత్వం కేటాయించిన పేట్ బషీరాబాద్ స్థలం మాదే అంటూ అదే స్థలంలో సర్వసభ్య సమావేశం జరపడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *