Screenshot 2023 08 09 082232

“సుప్రీం”కు సొసైటీ…

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరా బాద్ లో ప్రభుత్వం కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని వెంటనే సొసైటీకి బదలాయించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన అమలు చేయడంలో ఇంతకాలం జరిగిన ఆలస్యం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ సొసైటీకి చెందిన సభ్యుల బృందం సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది మరో 10 రోజుల్లో ఏడాది కావస్తున్నందున ఆ తీర్పును, తమ స్థలాన్ని కాపాడుకునే ప్రయత్నంలో…

Read More
pet land 1

ఈ అంశం కీలకం…!

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి చెందిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భుమిని దక్కించుకోవడానికి సొసైటీ సభ్యుల్లో కొందరు కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళడంతో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పునకు అనుకూలంగా ఉన్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటిఅర్ చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం ఆలస్యం చేస్తోందనే ఆందోళనతో కొందరు సభ్యులు పిటిషన్ వేయడానికి డిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే, పిటిషన్ దాఖలు చేయడంలో…

Read More
jnj members

అటు నిర్లక్ష్యం.. ఇటు నిస్సహాయత…

ఒకవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, అసలు ఏం చేయలనుకుంటుందో తెలియని అయోమయం…. మరోవైపు ఈ సమయంలో చురుకుగా వ్యవహరించాల్సిన  హౌసింగ్ సొసైటీ  నత్త నడక పనులు…సమస్య పరిష్కారానికి సరైన ప్రయత్నాలు చేయకపోవడం ఇవ్వన్నీ కలిసి సభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నాయి. ఈ విషయాల్లోనే  జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్  సొసైటీ  సభ్యుల మధ్య అగాధం పెరగడానికి దారి తీస్తోంది. ప్రభుత్వానికి, జర్నలిస్టులకు మధ్య సమన్వయ కర్తగా ఉండాల్సిన మీడియా అకాడమీ సైతం ఎలాంటి పరిష్కార మార్గాలు వెతుకుతుందో బాహ్య…

Read More
Screenshot 20230731 221120 Gallery 1

స్థలం ఎందుకు ఇవ్వరు…

ప్రభుత్వం పేట్ బషీరాబాద్ లో  కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని సొసైటీ సర్వసభ్య సమావేశం డిమాండ్ చేసింది. ఈ నెల 10వ తేదీలోపు ఆ భూమిలోని ఆక్రమణలు తొలగించి సొసైటీ కి బదలాయించాలని, లేకపోతే హైదరాబాద్ లోని అన్ని హెచ్.ఎం.డి.ఎ. కార్యాలయాల ముందు నిరసనలకు దిగుతామని వెల్లడించింది. పేట్ బషీరాబాద్ స్థలంలో  జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది….

Read More
jnj c 2

ఈ జాగా మాదే…

దాదాపు 16 ఏళ్ల తీరని కల. 2007 లో అప్పటి ప్రభుత్వం కేటాయించిన భూములపై కొండంత ఆశ. ఎప్పటికైనా దక్కకపోతుందా అనే గట్టి నమ్మకం. సుధీర్ఘ ఎదురుచూపులు. చివరకు హైదరాబాద్ విలేకర్లకు ఇళ్ళ స్థలాలు ఇవల్సిందే అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో తమ సమస్య పరిష్కారం అయినట్టే అన్న నిట్టూర్పు. కానీ “సుప్రీం” తీర్పు ఇచ్చి ఏడాది గడుస్తున్నా అతీ గతీ లేదు. విన్నపాలు, పోరాటాలను పట్టించుకున్న నాధుడే లేడు. ప్రభుత్వం ఎవరికో మేలు…

Read More
nizmpet1

చచ్చి పోతున్నారు…స్థలాలు ఇవ్వండి….

దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులకు ప్రతీ ఒక్కరు కట్టుబడి ఉండాలి. సుప్రీం కోర్ట్ ఆదేశాలను విధిగా, బాధ్యతగా గౌరవించాలి, అమలు చేయాలి. కానీ, తెలంగాణలో జరుగుతున్న తంతు అందుకు భిన్నంగా ఉంది. ఎప్పుడో 16 సంవత్సరాల కిందట హైదరాబాద్ లో జర్నలిస్టులు కొనుగోలు చేసిన ఇళ్ళ స్థలాల వ్యవహారం కోర్టుల్లో నలిగి చివరకు 14 ఏళ్ల సుధీర్గ విచారణల తర్వాత  జర్నలిస్టులకు కేటాయించిన  స్థలాలు వారికి ఇవ్వాలని  గత ఏడాది  సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది….

Read More