తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంజూరు చేయాలని కోరుతూ డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఈ రోజు శాసన సభలో పురపాలక శాఖ మంత్రి కెటిఅర్ ని వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన మంత్రి జర్నలిస్టులకు తప్పని సారి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ తో చర్చించనున్నట్టు తెలుపారు.
ఇదిలా ఉంటే, తమకు న్యాయంగా దక్కాల్సిన భూముల విషయంలో ప్రభుత్వం అవలభిస్తున్న నిర్లక్ష్య ధోరణి పట్ల జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్త్ష చేస్తున్నారు. పేట్ బషీరా బాద్ లోని 38 ఎకరాల భూమిని సొసైటీ కి బదలాయించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి ఏడాది కావస్తున్నా ప్రభుత్వమూ, అధికారులు పట్టించుకోక పోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాక, సభ్యులు కొందరు న్యాయపోరాటం దిశగా ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం , సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కారం పిటిషన్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రెస్ క్లబ్ లో కమిటీ సభ్వయుల నుంచి వకాల్తా సేకరిస్తున్నారు.