నష్టం జరిగింది…

central team in

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో సమావేశమైంది. ఈ నెల ఒకటవ తేదీ నుండి మూడవ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలకు చెందిన ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించింది. కేంద్ర ప్రతినిధి బృందంతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా లు సీ.ఎస్. తో సమావేశమయ్యారు. ఈ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ సంయుక్త కార్యదర్శి కునాల్ సత్యార్థి మాట్లాడుతూ భారీ వర్షాలకు దెబ్బతిన్న ఐదు జిల్లాల్లో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. వీటితోపాటు వరి పంట, పత్తి పంటలు పూర్తిగా ధ్వంసమైనట్టు తమ పరిశీలనలో తేలిందన్నారు. ప్రధానంగా మోరంచపల్లి, కొండాయి గ్రామాలూ పూర్తిగా నీట మునిగి ఆస్తి నష్టం కలిగినట్టు తెలిపారు. అయితే, ఈ ఐదు జిల్లాల కలెక్టర్లు చేపట్టిన ముంగు జాగ్రత్త చర్యలవల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా నివారించారని పేర్కొన్నారు. విపత్తుల నివారణకుగాను కేంద్ర ప్రతినిధి బృందం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని శాంతి కుమారి తెలిపారు. సమావేశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటి సెక్రెటరి అనిల్ గైరోలా, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ హైదరాబాద్ రీజనల్ర్ అధికారి ఎస్.కె.కుష్వా, జలశక్తి మంత్రిత్వ శాఖ హైదరాబాద్ డైరెక్టర్ రమేష్ కుమార్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ హైదరాబాద్ రీజనల్ ఆఫిసర్ పొన్నుస్వామి, విద్యుత్ శాఖ అధికారిణి భవ్య పాండే తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *