ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏదో ఒక అంశాన్ని చర్చనీయాంశంచేస్తారు. వచ్చే ఎన్నికలలో విశాఖ పట్నం నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించారు. జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమానికి హాజరైన అయన విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాయని పాల్ మండిపడ్డారు. విశాఖ స్థానికుదడిననీ, రానున్న రోజుల్లో ఇక్కడే నివాసం ఉంటానని చెప్పారు. అంతేకాక, రాబోయే ఎన్నికలలో విశాఖ నుంచే ఎంపిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.
విశాఖ నుంచి పోటీ…
