ప్రజా గాయకులు గద్దర్ పార్దీవ దేహాన్ని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వేలాది మంది అభిమానులు, విప్లవ, నృత్య కళాకారులు, పలువురు ప్రముఖులు దర్శించి నివాళులు అర్పించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పోలీసు అధికారి సజ్జనార్ గద్దర్ పార్దీవ దేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు.అయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గద్దర్ పార్దీవ దేహాన్ని తెలంగాణ పోరాట అడ్డా అయిన గన్ పార్క్ వద్ద నిలిపారు. అక్కడి నుంచి అంతిమ యాత్ర అల్వాల్ భూదేవి నగర్ లోని మహాభోది విద్యాలయనికి చేరింది. అక్కడ అంత్యక్రియల ఏర్పాట్లను గద్దర్ కూతురు వెన్నెల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మహాభోధి విద్యాలయం లోని గ్రౌండ్ వెనకాల సమాధి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.