నగరంలోని ఉప్పల్-నారపల్లి మధ్య ఎలివేటేడ్ క్యారిడార్ లో భాగంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనుల జాప్యం వల్ల అధ్వాన్నంగా మారిన రోడ్ల బాగుచేయడానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. స్థానిక ప్రజా ప్రతినిధులు ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావుని కలిసి వాహనదారులు, పాదచారులు ఎదుర్కొంటున్న సమస్యలు, కొంత కాలంగా ఈ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల గురించి వివరించారు. జాతీయ రహదారి కావడం , రోజు రోజుకీ వాహనాల రద్దీ పెరగడంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే రోడ్ల ఏర్పాటు, మరమత్తు పనులు చేపట్టాలని అధికారులని ఆదేశించారు. దీంతో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అధ్వర్యంలో అధికారులు పనులు ప్రారంభించారు.