ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినా, ఎన్ని రకాల స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి తెచ్చినా అక్రమార్కుల ఆగడాలు మాత్రం అదుపు కావడం లేదు. శంషాబాద్ విమానాశ్రయంలో తాజాగా పట్టుకున్న బంగారమే ఉదాహరణ. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుండి కస్టమ్స్ అధికారులు కిలోన్నరకు పైగా బంగారం స్వాధీనం చేసుకుకున్నారు.పట్టుపడ్డ వ్యక్తులు చాకచక్యంగా దుస్తుల్లో బంగారాన్ని అమర్చుకొని దర్జాగా విమానం దిగారు. కానీ, తనిఖీ ప్రాంతం వద్ద కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కారు. వీళ్ళ నుంచి 1.527 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 93.26 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.