ఇది నిజమైతే…శుభవార్తే…!

20230703 135508 scaled

హైదరాబాద్ జర్నలిస్టుల చిరకాల ఆశ నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం అందుతోంది. సుమారు మూడు దశాబ్దాలుగా  హైదరాబాద్ లో పనిచేస్తున్న విలేకరులు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి లో సభ్యులకు 2007వ సంవ్సరంలో  అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. నిజాం పేట్ ప్రాంతంలో 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాలు కలిపి మొత్తం 70 ఎకరాలు ఆ సొసైటీకి కేటాయించింది. అయితే, ఈ స్థలాలు పలురకాల కేసుల వల్ల నేటికీ సొసైటీ సభ్యులకు దక్కలేదు. గత ఆగస్టు నెల 25వ తేదీన సుప్రీం కోర్టు తీర్పుతో  సొసైటీకి ఉపశమనం కలిగింది. ఆ రెండు ప్రాంతాల్లోని స్థలాలను సొసైటీకి అందజేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కానీ, ప్రభుత్వ ఆలోచనా విధానం,  అంతర్గతంగా ఉన్న కొన్ని సమస్యల వల్ల  ఆ స్థలాలను ఇప్పటికీ సొసైటీకి బడలయించ లేదు.

Screenshot 2023 08 09 082232

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ  పేట్ బషీరాబాద్ స్థలాన్ని బడలయించడంతో పాటు ఆ సొసైటీలో సభ్యులు కాని కొత్త వారికీ ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు కదిపినట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కొత్త వారికి ఓ సొసైటీ ఏర్పాటు చేసి అర్హులైన వారికి సభ్యత్వం ఇచ్చే ప్రక్రియ కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మీడియా అకాడమీ కొత్త భావన నిర్మాణం పూర్తీ అయింది. త్వరలో జరిగే ఈ భావన ప్రారంభోత్సవ కార్యక్రమంలో విలేఖర్లకు ఇళ్ల స్థలాల శుభవార్త అందే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *