రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే గులాబీ దండును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) తరఫున పోటీ చేయనున్న సుమారు 115 మంది అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. వివిధ కారణాల వల్ల నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ నియోజక వర్గాల్లో అభ్యర్థులను పెండింగులో ఉంచారు. ఎక్కువగా సిట్టింగులకే అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కొన్నిచోట్ల పక్కన పెట్టారు.
ఆసిఫాబాద్, బోథ్, వైరా, ఉప్పల్, తాండూరు, వేములవాడ, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో సిట్టింగులు గల్లంతు అయ్యారు. ఆయా నియోజక వర్గాల్లో అసంతృప్తి సెగలు బయట పడడంతో అభ్యర్ధుల మార్పు తప్పలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో స్వర్గీయ సాయన్న కుమార్తె లాస్యను పోటీలో దించనున్నారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు కేసీఆర్ చెప్పారు.