IMG 20240722 WA0004

పోటీ చేయను…

అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా రేసులో వున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ మనుగడ, దేశ ప్రయోజనాల కోసం పోటీ నుండి పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే ప్రస్తుత అధ్యక్ష పదవిలో పూర్తి కాలం కొనసాగుతానని స్పష్టం చేశారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హరీస్ ను బైడెన్ ప్రతిపాదించారు. కానీ, దీనిపై పార్టీ తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది.

Read More
IMG 20240418 WA0007

మల్కాజిగిరి బరిలో “బాషా”

దేశంలోనే అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరి సీటును జై స్వరాజ్ పార్టీ ఒక ఆటోడ్రైవర్ కి కేటాయించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన వాహన చట్టంలోని కఠిన తరమైన నిబంధనలు తమకు ఇబ్బందిగా ఉన్నాయని డ్రైవర్లు పార్టీ దృష్టికి తెచ్చారని, వాటికి వ్యతిరేకంగా నిరసన తెలపడమే కాకుండా సామాన్య డ్రైవర్లకు తాము అండగా ఉండాలనే ఆలోచనతో నగరంలోని ఒక ఆటో డ్రైవర్ కు సీటు కేటాయించామని జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు…

Read More
sharmila c1

“చెయ్యి”ఎత్తిన షర్మిలా…!

కేసీఆర్ మీద ప్రజలకు తారా స్థాయిలో వ్యతిరేకత ఉందని, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేక ఓటును చీల్చొద్దనే ఒకే ఒక్క ఆలోచనతో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోందని ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశం ఉందని, మళ్లీ కేసీఆర్ కు అవకాశం ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేసినట్టు ఆమె తెలిపారు. ఈ విషయంలో లోతుగా పరిశీలించిన తర్వాతే రాబోయే ఎన్నికల్లో…

Read More
babu pavan

టిడిపి-“సేన”లో పొత్తు చిచ్చు..!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీల పొత్తుల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పెద్ద పార్టీలతో చేతులు కలుపుతున్న పార్టీల వ్యూహాలు సామాన్యులకు అంతు పట్టడం లేదు. గత ఎన్నికలలో అంటకాగిన పార్టీలు ఈ సారి ఎడమొహం పెడమొహంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ శత్రువులుగా మారాయి. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రాలో బిజెపితో కలిసి తిరిగిన జనసేన ఈ సారి రూటు మార్చింది. మొన్నటి వరకు…

Read More
IMG 20231002 WA0045 2

తెలంగాణలో సై…

తెలంగాణలో రానున్న ఎన్నికల బరిలోకి దిగడానికి జనసేన సిద్ధమైంది. వివిధ జిల్లాల్లో మొత్తం 32 నియోజక వర్గాలలో తమ అభ్యర్ధులు పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. ఉమ్మడి హైదరాబాద్, రంగరెడ్డి జిల్లాలోని కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, కుతుబుల్లాపూర్, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఉప్పల్, పటాన్‌చెరువు, మల్కాజిగిరి, మేడ్చల్ వంటి 9 నియోజక వర్గాలు సహా ఖమ్మం జిల్లాలోని 7 నియోజక వర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేస్తారు.

Read More
Screenshot 20230925 164239 WhatsApp

హైదరాబాద్ సే కరో…

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎం.ఐ.ఎం. నేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో రాహుల్ గాంధీకి దమ్ముంటే వాయనాడ్ నియోజకవర్గం నుంచి కాకుండా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని వ్యాఖ్యానించారు.

Read More
IMG 20230821 WA0011

రెండు చోట్ల కేసీఆర్…

రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే గులాబీ దండును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) తరఫున పోటీ చేయనున్న సుమారు 115 మంది అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. వివిధ కారణాల వల్ల నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ నియోజక వర్గాల్లో అభ్యర్థులను పెండింగులో ఉంచారు. ఎక్కువగా సిట్టింగులకే అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కొన్నిచోట్ల పక్కన పెట్టారు. ఆసిఫాబాద్, బోథ్, వైరా, ఉప్పల్, తాండూరు, వేములవాడ, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో సిట్టింగులు గల్లంతు అయ్యారు. ఆయా…

Read More