
“ఉత్తమ”అవార్డులు…
డిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ నటునిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా అలియాభట్ అవార్డులు అందుకున్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేశారు.
డిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ నటునిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా అలియాభట్ అవార్డులు అందుకున్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేశారు.
జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొంది మంచి జోరుమీదున్న స్టైలిష్ స్టార్ పుష్ప అల్లు అర్జున్ అనుకున్నట్టుగానే గానే అభిమానులకు ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తారు. పుష్ప-2 సినిమా షూటింగ్ ఎలా జరుగుతోందో చూపించడానికి ఓ వీడియోను రూపొందించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగు తోందని, ఇక్కడ చాలా మంది అభిమానులు తనను కలవడానికి వస్తున్నారని బన్నీచెప్పుకోచ్చారు. పుష్ప-2లో తనది నెవర్ గివ్-అప్ క్యారెక్టర్ అంటూ మూవీపై అంచనాలను ఇట్టే పెంచేసారు. సుకుమార్ తో సరదాగా కనిపించారు.
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయం బన్నీ నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి “పుష్ప”కి శుభాకాంక్షలు తెలిపారు.
“తగ్గేదే లే” అంటూ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు హోరెత్తించిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. సుమారు ఏడు దశాబ్దాల జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాల్లో ఒక హీరో క్యారెక్టర్ కి జాతీయ అవార్డు రావడం ఇదే తొలిసారి కావడం గ విషయం. 2021 సంవత్సరానికి గాను 24 కేటగిరీల్లో 69వ జాతీయ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో తెలుగు తెర మెరవడం విశేషం. రాజమౌళి రూపొందించిన…