చంద్రయాన్-౩ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన దృషిని ఇప్పుడు ఏకంగా సూర్యుని పైకి సారించింది. వచ్చే నెల రెండోన మిషన్ సన్ “ఆధిత్య” పేరుతొ మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఆ రోజు ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఆకాశంలోకి దూసుకుపోనున్నట్టు ఇస్రో తెలిపింది. ఆధిత్య –ఎల్1 భూమికి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుందని, ఇది చంద్రుని పైకి పంపిన దానికంటే నలుగు రెట్లు అధికమని, ప్రపంచంలో సూర్యుని పైకి పంపే మొదటి సోలార్ మిషన్ ఇదే అని వివరించింది. ధగ ధగలాడే సూర్య ప్రతాపానికి ఆధిత్య ఏ మేరకు తట్టుకొని “బాబాయి”ని చేరుతుందనేది ఆసక్తిగా మారింది. 14౦ కోట్ల హృదయాలు ఆధిత్య క్షేమాన్ని కోరుకుంటున్నాయి. జయహో ఇస్రో…