గతంలో ఎన్నడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. గత నెలలోనే వర్షా కాల వేశాలు ముగించుకున్న మోడీ ప్రభుత్వం ఒక్కసారిగా తిరిగి సమావేశాలకు సిద్ధపడడం పలు రకాల ఉహాగానాకు తెర లేపుతోంది. కొందరు కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ కోసమని, మరికొందరు జమిలీ ఎన్నికల కోసమని అభిప్రాయ పడుతున్నారు. ఈ రెండు అంశాలు కాకా పార్లమెంటును అంత అత్యవసరంగా సమావేశ పరచాల్సిన అవరసరం ఏముందని విశ్లేషిస్తున్నారు. మోడీ మొదటి నుంచి జమిలీ ఎన్నికల వైపే మొగ్గు చూపడం కూడా ఈ చర్చ లకు దరితిస్తోంది. “ఒకే దేశం ..ఒకే ఎన్నికలు” అనే నినాదం వైపు మోడీ సుమారు ఐదారేళ్లుగా అలోచిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్నీ అనేక సార్లు ప్రస్తావించారు. ఎదో ఓకే కీలక నిర్ణయం ఉంటుంది కాబట్టే ఈ నెల 18 వ తేది నుంచి మూడు లేదా ఐదు రోజుల పాటు లోక్ సభను సమావేశపరచాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.ఆ సమావేశాలు జమిలీ ఎన్నికల కోసం కూడా కావచ్చని ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించడం గమనార్హం.