ప్రముఖ మలయాళ నటి అపర్ణా నాయర్ మృతి చెందారు. ఆమె తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి 7.03 గంటల సమయంలో అపర్ణ ఆత్మహత్యకు పాల్పడింది. అపర్ణా నాయర్ కరమన సమీపంలో ఉన్న తన ఇంట్లోని గదిలో ఉరి వేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రయివేటు ఆసుపత్రి నుంచే తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. అసహజ మరణం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబ కలహాల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఫటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అపర్ణా నాయర్‌కి భర్త, ఇద్దరు పిల్లలున్నారు. కొంత కాలంగా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు, వివాదాలు తలెత్తినట్టు తెలుస్తోంది.