చైనాకు గ్రానైట్ రాయి ఎగుమతుల్లో శ్వేతా గ్రైనేట్స్ అక్రమాలకు పాల్పడినట్టు కేంద్ర ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఈ మేరకు తెలంగాణా రాష్ట్ర పౌస రఫరాల శాఖ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడి నోటీసులు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలకు విరుద్ధంగా శ్వేత ఏజెన్సీస్ 4.8 కోట్ల రూపాయల ఉల్లంఘన కి కి పాల్పడినట్టు ఈ.డి. పేర్కొంది.గ్రైనేట్ మెటీరియల్ ఎగుమతి చేయడంలో ఈ అక్రమాలు జరిగినట్లు తెలిపింది.ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులో కేవలం 3 కోట్లు చెల్లించిన శ్వేతా ఏజెన్సీస్, సుమారు 50 కోట్ల వరకు పెండింగ్ లో పెట్టిందని, హవాలా మార్గంలో డబ్బు బడలాయించిందని ఈడి వివరించింది. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు.గత ఏడాది నవంబర్ లో శ్వేతా ఏజెన్సీస్ పై ఈ.డి.సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. విజిలెన్స్ అధికారుల విచారణ ప్రకారం 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రైనేట్ ను అక్రమంగా చైనాకు తరలించినట్టు, చైనీస్ కంపెనీల నుంచి హవాలా మార్గం ద్వారా బదలాయింపులు జరిగినట్టు ఈ.డి.అధికారులు గుర్తించారు.
శ్వేతాకి నోటీసులు..
