భారత అంతరిక్ష పరిశోధనసంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ఊహించని అద్భుతాలను చూపిస్తోంది. చంద్రునిదక్షిణ ధృవం మీద విక్రమ్ కలుమోపడమే చరిత్ర ఐతే, అది గలిలో ఎగిరి ఒక చోటు నుంచి మరో చోటుకి గాలిలో ఎగిరి ప్రయాణించడం ఓ అద్భతమైన ఆవిష్కరణ. చంద్రుడి దక్షిణ ధృవం మీద ఉన్న ప్రగ్యాన్ రోవర్ నిద్రలోకి వెళ్లింది. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్ ను ఇస్రో శాస్త్రవేతలు విజయవంతంగా గాలిలోకి లేపారు. విక్రమ్ ల్యాండర్లో ఉన్న ఇంధనాన్ని మండించటం ద్వారా దాన్ని చంద్రుడి ఉపరితలం నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు గాల్లో ఎగిరేలా చేశారు. గాల్లోకి లేచిన తరవాత ల్యాండర్ 30 నుంచి 40 సెంటీ మీటర్ల దూరం ప్రయాణం కూడా చేసింది. మరో ప్రదేశంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఒక పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా దేశాలు చంద్రుడిపై దిగటం వరకే పరిమితం అయ్యాయి, కానీ అవి దిగిన ఉపరితలం నుంచి మళ్లీ గాలిలోకి ఎగిరించిన సందర్భాలు లేవు. సాధారణంగా ల్యాండర్ ని దక్షిణ ధృవం వైపు అడుగులు వేయించడమే గగనం అయితే, దాన్ని మళ్ళీ కదిలించడం నిజంగా ఇస్రో, దాని సాంకేతిక నైపణ్యాభివృద్ధికి సలామ్ చేయాల్సిందే.