ఎన్నో ఆశలతో తెలంగాణ ఆడపడుచు అంటూ రాజకీయ చట్రంలో దిగిన వై.ఎస్.షర్మిల సారథ్యంలోని వై.ఎస్.అర్. తెలంగాణ పార్టీ భవితవ్యం ఎటూ తేలకుండా ఉంది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో అంటకగుతున్న షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తన పార్టీ షరతులను ఢిల్లీ పెద్దల చెవిన వేసి ఈ నెల 30వ తేదీని విలీన వ్యవహారానికి తుది గడువు విధించింది. గతంలో ఆమె పాలేరు సీటుని ఆశించింది. ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరడం, అయన కూడా పాలేరు సీటు పైనే పట్టుపట్టడంతో షర్మిల వ్యవహారం ప్రశ్నార్థకంగా మారింది. 30వ తేదీ వరకు కాంగ్రెస్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోతే రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించనున్నట్టు కూడా షర్మిల ప్రకటి చారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో తీవ్ర ఒత్తళ్లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ షర్మిల పార్టీ విలీనం పై ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.