ఆంధ్రప్రదేశ్ లో కురు క్షేత్ర యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి, పేదలను వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం ఉంటుందని తెలిపారు. పేదలకు, పెత్తందారులకూ మధ్య యుద్ధం జరగనుందని పేర్కొన్నారు.అమరావతి పేరుతో స్కామ్, స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, నీరు-చెట్టు పేరుతో దోపీడీ చేసిన వారితో యుద్ధం జరగబోతుందని జగన్ అన్నారు. విజయవాడలో వరుసగా అయిదో ఏడాది వాహన మిత్ర నిధులను జగన్ విడుదల చేశారు. వాహనమిత్రతో ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు లబ్ధి పొందుతుండగా, ఇప్పటి వరకు 2,75,931 మంది ఖాతాల్లోకి 10 వేల రూపాయల చొప్పున జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 99శాతం హామీలు అమలు చేశామని చెప్పారు. మన ప్రభుత్వం “వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్” అని పేర్కొన్నారు. ఒకవైపు పేదల ప్రభుత్వం ఉంటే మరోవైపు పేదల్ని మోసగించిన వారు ఉన్నారని విమర్శించారు.