చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో నిర్వహిస్తున్న వివిధ విభాగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ లో వంద పతకాలను సాధించి తొలిసారి రికార్డు నెలకొల్పింది. శనివారం మహిళల కబడ్డీ విభాగంలో చైనీస్ తైపీపై భారత్ ఘన విజయం సాధించడంతో ఇండియా పతకాల్లో సెంచరీ జాబితాలో చేరింది. ఇప్పటి వరకు 25 బంగారు, 35 రజతం, 40 కాంస్య పతకాలు సాధించింది. అన్నివిభాగాల్లో కలిపి 100 పతకాలు సాధించిన భారత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో ఉండి. 2018వ సంవత్సరంలో జరిగిన ఆసియా గేమ్స్ లో భారత్ 70 పతకాలు సాధించింది. అసంఖ్యను ఇప్పుడు వందకు చేరడం విశేషం.