సెర్బియా దేశ రాజధాని బెల్ గ్రేడ్ లో జరిగిన ఒపెన్ వాటర్ ఫిన్ స్విమ్మింగ్ వరల్డ్ మాస్టర్స్ ఛాంపియన్ షిప్ – 2023 పోటీలలో తెలంగాణ స్విమ్మర్ క్వీనీ విక్టోరియా గంధం సత్తా చాటింది. 3 కిలోమీటర్ల మోనో ఫిన్ విభాగంలో బంగారు పతకం,1 కిలోమీటర్ మోనో ఫిన్ విభాగంలో రజిత పతకాలను సొంతం చేసుకుంది.సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ ఈ పోటీలు జరిగాయి. మన దేశం నుంచి ఓపెన్ వాటర్ ఫిన్ స్విమ్మింగ్ వరల్డ్ మాస్టర్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్న మొట్ట మొదటి స్విమ్మర్ గా విక్టోరియా ఘనత సాధించారు. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ విక్టోరియాని అభినందిచారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ ను కనబర్చి దేశానికి, రాష్ట్రానికీ పేరు ప్రతిష్టలను తీసుకొస్తున్నారని కొనియాడారు. క్వీని విక్టోరియా గంధం గారు అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, కౌన్సిలర్ నరేందర్, ప్రముఖ సంఘ సేవకురాలు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.