కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయటానికి, కవిత జైలుకు పోకుండా కాపాడుకోవటానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలతో పనిలేదని, బిజెపి మాత్రమే సిద్దాంతానికి అనుగుణంగా నడుస్తోందని తెలిపారు. కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందన్నారు.తెలంగాణలో పదేళ్ళు అవినీతిలో మునిగి పోయిన బీఆర్ఎస్ కు మళ్ళీ అవకాశం ఇవ్వొద్దని కోరారు. రానున్న ఐదేళ్ళు మంచి పాలన ఎవరు ఇవ్వగలరో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని,కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పార్టీలని పేర్కోన్నారు. కుటుంబ, అవినీతి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను పక్కన కూర్చోపెట్టుకోబోమని, మజ్లిస్ తో కలసి ప్రభుత్వాన్ని నడుపుతోన్న కేసీఆర్ ను బిజెపి దగ్గరకు రానివ్వదని స్పష్టం చేశారు. తొమ్మిది ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకి తొమ్మిది లక్షల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని అమిత్ షా చెప్పారు.
కొడుకూ,కూతురి కోసమే…
