నిన్న నల్గొండ జిల్లాలో మూడు కోట్ల రూపాయల నగదు దొరకగా ఈ రోజు కరీంనగర్ జిల్లాలో మరో రెండు కోట్ల రూపాయల నగదు పట్టుపడింది. అనేక చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ డబ్బు ప్రవాహం ఆగడంలేదు. నగదు స్వదినంపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలో అక్రమంగా డబ్బు, మద్యం, ఇతరములను నిరోధించుటకు పలు చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు జిల్లా లోని కరీంనగర్ పట్టణ డివిజన్ లోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ వద్ద వాహన తనిఖీ చేపట్టినట్టు చెప్పారు. తనిఖీల్లో భాగంగా టీఎస్ 09 యుడి 5198 నెంబర్ ఉన్న వాహనం నుంచి సరైన ఆధారాలు చూపని 2,36,48,494 డబ్బు పట్టుకున్నట్టు వివరించారు. ఈ విషయంపై ఆదాయ పన్నుశాఖ అధికారులకు సమాచారం అందించామని కమిషనర్ చెప్పారు.
