గాడి తప్పుతున్న రాజకీయం…!

exclusive c

దేశంలోని ఏ రాష్ట్రంలో కనిపించని రాజకీయ వ్యవస్థ అంధ్రప్రదేశ్ లో వేళ్ళూనుకుంటున్నట్టు కనిపిస్తోంది. రాజకీయం వేరు, వ్యక్తిగత వ్యవహారాలు వేరు అనే నానుడికి అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాలం చెల్లుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించిన ఎవరినైనా సరే అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం తప్పు కాదు. ఒక అనుమానితుడిని అరెస్టు చేస్తే అతని నేర విచారణ వ్యవహారం చట్టం, న్యాయం చూసుకుంటాయనేది జగత్ విదితమే.

babu in
jagan in
UNCONTRLD

కానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి పూర్తీ భిన్నంగా ఉండడం గమనార్హం. నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆరోపణల్లో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు సిఐడి పోలీసులు, ఎసిబి న్యాయస్థానం, హైకోర్టు, ఢిల్లీ లోని అత్యున్నత న్యాయస్థానంలో చంద్రబాబు అరెస్టుపై రకరకాల విచారణలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదంతా అటు నిందితుని తరపు న్యాయవాదులు, అటు కోర్టు, ప్రభుత్వం తరపు ప్లీడర్ల వాదనలతో కూడుకున్న వ్యవహారం. అంతిమంగా కోర్టు ఆదేశాలు అందరికీ శిరోధార్యం. తీర్పు,ఆదేశాలు వచ్చే వరకు నిందితుడు సహా ప్రతీ ఒక్కరూ వేచిచూడాల్సిందే. ఈ విషయాలన్నీ ఆంధ్రాలో అధికార పక్ష నేతకు తెలియని విషయం కాదనేదనీ రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
అయితే, చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్ తర్వాత తెలుగుదేశం పార్టీ పైనా, ప్రత్యేకించి చంద్రబాబు, అయన కుటుంబ సభ్యుల పై వైసిపి నాయకులూ, కొందరు మంత్రులు చేస్తున్న విమర్శలూ, అరోపణలు పరాకాష్టకు చేరుకోవడం దురదృష్టకరం అని సీనియర్ రాజకీయ అనుభవజ్ఞులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా వైసిపికి చెందిన నేతలు చేస్తున్న విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు టిడిపి నాయకులకు, శ్రేణులకు పుందుమీద కరం చల్లినట్టుంది. చంద్రబాబు డీహైడ్రేషన్ కి గురై, దద్దుర్లు వంటి ఇన్ ఫెక్షన్ బారిన పడినట్టు ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ని చల్లని వాతావరణంలో ఉంచాలని కూడా సూచించారు.

babu medcl

ఇదే సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ,రిమాండ్‌లో భాగంగా జైలులో ఉంటే అదేమైనా అత్తగారి ఇల్లా? డీ హైడ్రేషన్‌ ఏమైనా ప్రాణాంతకమా, జైలులో ఏసీలు పెట్టాలా? చంద్రబాబు కంటే ఎక్కువ వయస్సు ఉ న్న లాలూ ప్రసాద్‌ యాదవ్, ఓం ప్రకాశ్‌ చౌతాలా కూడా జైల్లో ఉన్నారు. దేశంలో ఎక్కడా జైలులో ఏసీలు ఉండవు. చంద్రబాబు షర్ట్‌ అస్సలు విప్పడనీ, దాని వల్ల చెమటతో స్కిన్‌ డిసీజ్‌ వచ్చి ఉండొచ్చు అని వ్యాఖ్యానించడం వివాదంగా మారింది. దీనికి బదులుగా చంచల్ గూడ జైలుని జగన్మోహన్ రెడ్డి సొంత అత్తగారి ఇల్లుగా మర్చడాని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అశోక్ బాబు వ్యాఖ్యానించారు. వైసీపీకే చెందిన ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చంద్రబాబుని చంపేది భువనేశ్వరినే అంటూ రెచ్చగొట్టే ప్రకటన చేయడం మరో వివాదానికి తెర లేపింది. ఇక అంబటి రాంబాబు, నాని వంటి వైసీపీ నేతలు ప్రతిరోజూ తెలుగుదేశం, ఆ పార్టీ నేతల పై ప్రతిరోజూ విసురుతున్న వ్యగ్యస్త్రాలు అందరికీ తెలిసిందే. చివరికి వైద్యుల రిపోర్టు పరిగణలోకి తీసుకున్న కోర్టు చంద్రబాబుకు వెంటనే ఏ.సి. సౌకర్యం ఏర్పాటు చేయాలనీ ఆదేశించడం గమనార్హం.రాజకీయ పార్టీల నేతలు కళ్ళాలు తెంచుకొని అడ్డు అదుపు లేకుండా మాట్లాడే విధానం కొంత కాలంగా అధికమైందనీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న వారు స్పష్టం చేస్తున్నారు.

ఉదాహరణకు అత్యంత రాజకీయ అనుభవజ్ఞులు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తోందని, కులం,డబ్బు అండతో క్రిమినల్స్ రాజకీయాల్లో ఉన్నారనీ, బూతులు మాట్లాడుతున్న రాజకీయ నాయకులకు పోలింగ్ బూతులో సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. దీన్నిబట్టి చూస్తే అంధ్రప్రదేశ్ రాజకీయాల పై పరిశీలకుల లోనే కాదు, సామాన్య జనం లోనూ ఎంతటి అభిప్రాయం ఉందో ఇట్టే అంచనా వేయవచ్చు. ప్రస్తుత అంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తుంటే ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కరుణానిధి, జయలలితల మధ్య సాగిన కక్ష్య సాధింపు రాజకీయాలు గుర్తుకొస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నేతలు అదుపు తప్పి వ్యవహరిస్తే పరిపాలన కూడా గాడి తప్పుతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *