
“రాజా”, దర్శకుడు ఎవరు?..!
“రాజా” పోసాని, రాజకీయాలు అంటే వెండితెరపై నటన అనుకున్నారా, కానే కాదు, సినిమాల్లో దర్శకుడు చెప్పినట్టు చేస్తే “నటన” పండుతుంది, కళామతల్లి కరుణిస్తుంది, నలుగురి మెప్పు దక్కుతుంది. కానీ, రాజకీయాల్లో నటిస్తే “పాపం” పండుతుంది. అధికార పక్షం ఆడుకుంటుంది. అందుకే రాజకీయాల్లో మాత్రం సొంత తెలివి అవసరం. ఏమి చేయాలో ఆలోచించాలి, రాసుకోవాలి, అమలు చేయాలి ఇవీ రాజకీయ నాయకుల లక్షణాలు. ఇతరుల స్క్రిప్ట్ ని అనుసరిస్తూ, “రాజకీయ దర్శకుల” సూచనలు పాటిస్తూ నటిస్తే ఇలాగే జైలు…