IMG 20240729 WA0048

వాదించలేక మౌనం!

తనపై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, వ్యక్తులు, ప్రసార సాధనాల పై పరువునష్టం దావా వేస్తానని తెలంగాణలో ఉద్యమ పార్టీ నేతృత్వంలోని “ఒంటెద్దు” ప్రభుత్వంలో పదవీ విరమణ చేసినా కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐఎఎస్ అధికారి జనవరి నెలలో చేసిన బెదిరింపులు అందరికీ గుర్తుండే ఉంటాయి. 2018లో కొత్తపల్లిలోని ఫార్మాసిటీ ప్రాంతంలో25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు వచ్చిన బలమైన ఆరోపణల పై సోమేష్ వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు.అదే సందర్భంలో ప్రసార…

Read More
IMG 20240326 WA0024

జై…”తీహార్” …

ఢిల్లీ మద్యం విక్రయ లావాదేవీల కుంభకోణంలో చిక్కుకున్న తెలంగాణా ముద్దు బిడ్డ కల్వకుంట్ల కవిత చివరి వరకు ఎన్ని సాకులు చెప్పినా తిహర్ జైలు ఊసల వెనక్కి వెళ్ళక తప్పలేదు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ అధికారుల కస్టడీ అనంతరం ఆమె చేసిన అర్థరహింత విజ్ఞప్తిని కోర్టు త్రోసిపుచ్చింది. తన కుమారుని పరీక్షలు ఉన్నాయంటూ ఆమె చేసిన విజ్ఞప్తిని కోర్టు సాకుగా పరిగణించింది. అందుకే, కవితకు వచ్చే నెల 9 వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీ…

Read More
brs natnl cc

మూలిగే “బిఆర్ఎస్”పై “మందు సీసా”…!

తెలంగాణా శాసనసభ ఎన్నికలకు ముందు కళ్ళాలు లేని గుర్రంలా పరుగులు తీసిన భారత రాష్ట్ర సమితి ఆ ఎన్నికల ఫలితాల అనంతరం సావడికే పరిమితమైంది. అధికారంలో ఉన్నప్పుడు అంతులేని ఆలోచనలతో రంకెలేసిన భారాస అధినేత, ఆయన అనుచరగణం ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పదేళ్ళ తిరుగులేని పాలనలో జరిగిన అవినీతి,అక్రమ వ్యవహారాలు ఒక్కసారిగా గుప్పుమనడం భారాస మనుగడకు తలనిప్పిగా మారడం ఒక సమస్య అయితే, ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత…

Read More
remand

సాక్ష్యం చూపరు…బెయిల్ ఇవ్వరు…!

అనుమానితులు, నిందితులను పట్టుకున్న 14 రోజుల్లో నేర పరిశోధన పూర్తి చేసి ఆధారాలను కోర్టు ముందు ఉంచాల్సిన పోలీసు యంత్రాంగం నిర్లిప్తత వల్ల అనేక మంది రిమాండ్ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం, అధికారులు, రాజకీయ నేతల తెరచాటు జోక్యం, వాళ్ల ఒత్తిళ్లు ఖైదీలకు శాపంగా మారుతోంది. చట్టల్లోని లొసుగులు కూడా కేసుల సాగదీతకు కారణం అవుతున్నాయి. ఫలితంగా రిమాండ్ ఖైదీల పరిస్థితి దయనీయంగా మారుతోంది. దోపిడి, దొంగతనాల కేసుల్లో దొరికిన నిందితుల విషయాన్ని పక్కన…

Read More
exclusive c

గాడి తప్పుతున్న రాజకీయం…!

దేశంలోని ఏ రాష్ట్రంలో కనిపించని రాజకీయ వ్యవస్థ అంధ్రప్రదేశ్ లో వేళ్ళూనుకుంటున్నట్టు కనిపిస్తోంది. రాజకీయం వేరు, వ్యక్తిగత వ్యవహారాలు వేరు అనే నానుడికి అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాలం చెల్లుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించిన ఎవరినైనా సరే అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం తప్పు కాదు. ఒక అనుమానితుడిని అరెస్టు చేస్తే అతని నేర విచారణ వ్యవహారం చట్టం, న్యాయం చూసుకుంటాయనేది జగత్ విదితమే. కానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి పూర్తీ భిన్నంగా ఉండడం…

Read More
IMG 20230912 WA0008

ములాఖాత్…

రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు ములాఖాత్ అనంతరం బయటకు వచ్చిన ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకష్, కోడలు బ్రాహ్మణి.

Read More
babu jail1

జగన్ వ్యూహంలో “చాణక్యుడు”…

ప్రజా క్షేత్రంలో 45 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, రాజకీయాల్లో తిరుగులేని చాణక్య వ్యూహాలూ, ఎత్తులకు పై ఎత్తులు వేసి అన్ని రంగాలూ, విషయాల్లో అనుభవశీలిగా పేరు తెచ్చుకున్న నారా చంద్రబాబునాయుడు ఎక్కడ, ఎందుకు ఇరుక్కుపోయారు? ఆయన ఎన్నడూ ఉహించని “ఏడు చువ్వలను” ఎందుకు లెక్కబెడుతున్నారు? నిజంగా తప్పు చేశారా లేక అనుయాయుల మాటలు నమ్మి తప్పులో కలేశారా? ఇవి ఇప్పుడు సామాన్యుల మదిలో తలెత్తుతున్న సందేహాలు. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి …

Read More
Screenshot 20230911 105403 WhatsApp

జైలులో “బాబు”…

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి ఎసిబి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Read More
IMG 20230906 WA0001 1

రిమాండ్…

ఆంధ్రప్రదేశ్  టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎ.సి.బి. కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గంటల తరబడి జరిగిన వాదోపవాదనల్లో బాబు అరెస్టుకి సంబంధించి సి.ఐ.డి. పోలీసులు పకడ్బందీ ఆధారాలు చూపడంతో  న్యాయస్థానం చంద్రబాబుకు బెయిల్ నిరాకరంచింది. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబుని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.స్కిల్ డెవలప్ మెంట్ లో జరిగిన కుంభకోణంలో చంద్రబాబునాయుడు ప్రమేయం ఉందని శనివారం రాత్రి ఆయనను నంద్యాలలో క్యాంపు…

Read More
ap cid c

అవినీతి కోసమే “స్కిల్”…

ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను అక్రమాలు చేయడానికే ప్రారంభించారని  ఆ రాష్ట్ర సి.ఐ.డి.చీఫ్ సంజయ్ వ్యాఖ్యానించారు. అందుకే నాటి కేబినెట్ ఆమోదం లేకుండానే స్కిల్ కార్పొరేషన్ను తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గంటా సుబ్బారావుకు ఈ సంస్థ బాధ్యతలు అప్పగించారన్నారు. అంతేకాక, ఈ సుబ్బారావుకు ముఖ్యమంత్రి సలహాదారు, ఉన్నత విద్యాశాఖలో ఉన్నత హోదా సహా మరో నాలుగు పదవులు ఇచ్చారన్నారు. ఈయన ద్వారా బాబు నిధులు మళ్లించేలా వ్యూహం రచించారని వివరాలు వెల్లడించారు. చంద్రబాబును విజయవాడ అవినీతి…

Read More
IMG 20230909 WA0004

చంద్రబాబు అరెస్ట్…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం. ఎట్టకేలకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసారు. నంద్యాలలో క్యాంపు కార్యాలయం వద్ద అర్ద్రరాత్రి హై డ్రామా చేసి ఆయన్ని అరెస్టు చేశారు. చంద్రబాబు హాయంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ లో జరిగిన కుంభకోణం పై సీఐడీ, ఈడీ విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు పాత్ర పై చాలా రోజులుగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఈ వ్యవహారంలో ఇప్పటికే అటాచ్ మెంట్లు జరిగాయి….

Read More
ed kavit buchi

దూకుడు ఎందుకు…

దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తిరిగి ఎందుకు వేగం పెంచిందనేది ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో చర్చననీయాంశంగా మారింది. రెండు రోజుల కిందట నిందితుడు బుచ్చిబాబుని ఈ.డి. విచారించడంతో ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో కథ ఎటువైపు తిరుగుతుందో అనే గుబులు పట్టుకుంది. ఈ.డి. ఒక్కసారిగా దూకుడు పెంచిందనే దానిపై అరా తీయడం మొదలైంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ…

Read More