యువత అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తీ స్థాయిలో వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలిసై సూచించారు.బివిఅర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యుర్ షిప్ ప్రారంభోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కంది లోని ఐఐటి హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న కాలంలో యువత ఉన్నత స్థాయికి ఎదగాలంటే సాంకేతిక పరిజ్ఞానంలో రానించడం అవసరం అన్నారు. ఐఐటి హైదరాబాద్ ఆవరణలో ఏర్పాటు చేసిన బిజినెస్ స్కూల్ కొత్త ఆవిష్కరణలకు చక్కగా ఉపయోగడుతుందని పేర్కొన్నారు. సైయెంట్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ ఛైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా బివిఅర్ సైయెంట్ ని నెలకొల్పినట్టు చెప్పారు.ఐఐటి హైదరాబాద్ సహకారంతో డిగ్రీ,మాస్టర్స్, పి.హెచ్.డి., ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ని అందిస్తున్నట్టు వివారించారు. ఈ కార్యక్రమంలో ఐఐటి హైదరాబాద్ సంచాలకులు బి.ఎస్. మూర్తి, భారత్ బయోటిక్స్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల తదితరులు పాల్గొన్నారు.
