ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నాణ్యమైన విద్య కోసం కొండంత ఆశతో దేశం నలుమూలల నుంచే కాకా, విదేశ విద్యార్దులు సైతం పెద్ద సంఖ్యలో ఈ క్యాంపస్ లో చేరుతుంటారు. అందుకే హైదరాబాద్ లోని ఇంగ్లిష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం(ఇఫ్లూ). 2007వ సంవత్సరం వరకు కూడా దీన్నే “సిఫెల్”గా పిలిచే వారు. ఇది భిన్న సంస్కృతులకు కేంద్రమని చెప్పవచ్చు. ఈ యూనివర్సిటిలో రకరకాల భాషలకు సంబంధించిన కోర్సులు నేర్చుకునే విద్యార్ధులు చదువుతో పాటు విభిన్న సంస్కృతీ, సాంప్రదాయాలను కూడా అలవరచు కోవడం విశేషం. తార్నాక లోని సువిశాలమైన క్యాంపస్, అక్కడి హాస్టళ్ళలోనే వందలాది మంది విద్యార్ధినీ, విద్యార్ధులు ఉంటారు. కానీ, ఈ మధ్య కాలంలో రకరకాల వివాదాలకు అడ్డాగా మారి ఆందోళనకు గురిచేస్తోంది. వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన విద్యార్ధినులు అభద్రత, లైంగిక వేదింపులకు గురవుతున్నట్టు వస్తున్నా ఆరోపణలు ఇఫ్లూ ప్రతిష్టకు మచ్చ తెచ్చేవిగా ఉన్నాయి.
ఇఫ్లూలో పాఠాలు చెప్పాల్సిన అధ్యాపకులే కీచకుల మాదిరిగా విద్యార్ధినుల వెంటపడుతున్నారు. ఈ క్యాంపస్ లో నాలుగైదు ఏళ్ళుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న లైంగిక వేధింపులపై విసిగి వేసారిన విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. యూనివర్సిటీ ఉప కులపతి , కొంతమంది అద్యాపకుల వైఫల్యాలను ఎండగడుతూ నిరసనకు దిగారు. పరిపాలనాపరమైన లోపాల మూలంగానే భద్రత లేకుండా పోయిందనీ, కొందరు అధికారులే కావాలని భద్రతకు తిలోదకాలు ఇస్తున్నారని విద్యార్దులు ముక్త కంఠంతో విమర్శిస్తున్నారు. విద్యార్ధుల బాగోగులు చూడాల్సిన ఉప కులపతి భద్రతాలోపలపై నిమ్మకునిరేత్తినట్టు వ్యవహరించడం వల్ల సమస్య మరింత జటిలమవుతోందని విద్యార్ధులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆంగ్ల భాషా విభాగంలో పనిచేస్తున్న కొందరు అద్యాపకులు విద్యార్ధినులతో అసభ్యంగా ప్రవర్తించడం, రాత్రి సమయాలలో సెల్ ఫోన్ లకు ఇబ్బంది, సభ్యకరమైన కరమైన సందేశాలు, ఫోటోలు పోస్ట్ చేయడం వంటి వేధింపులు పరాకాష్టకు చేరాయని పలువురు విద్యార్ధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలు తెలిసి కూడా ఉప కులపతి, ఇతర అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రొఫెసర్ ల ఆగడాలు మరింత అధికమైయ్యాయని చెబుతున్నారు. కొందరు అద్యాపకులు చదువు పేరుతో లైంగికంగా వేధిస్తూ, బెదిరింపులకు సైతం పాల్పడుతున్నట్టు బలమైన ఆరోపణలున్నాయి. క్యాంపస్ లో భద్రతను పట్టించుకోకపోవడం, ఒక ప్రైవేటు సెక్యూరిటి సంస్థ కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పజేప్పడంతో విద్యార్ధినుల రక్షణ కరువైందని ఇఫ్లూ విద్యార్దులు, విద్యార్ధి సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. యునివర్సిటిలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దాలని ఈ నెల 16వ తేదిన విద్యార్ధులు ఒక్కసారిగా ధర్నా, నిరసనకు దిగారు. క్యాంపస్ లో లైంగిక వేధింపులను అరికట్టాల్సిన “సెన్సిటైజేషన్ అండ్ రిడ్రేసల్ అఫ్ సెక్స్ వల్ హెరాస్మెంట్ “ (స్పర్శ్)ని వెంటనే పునరుద్దరించాలనే డిమాండ్ తో ధర్నా చేశారు. నలుగు నెలలుగా స్పర్శ్ ని ఎవరూ పట్టించుకోక పోవడం వాళ్ళ క్యాంపస్ లో విద్యార్థులు భద్రత అగమ్యగోచరంగా మారిందని విద్యార్ధి సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన ముగిసిన రోజు రాత్రే ఇద్దరు వ్యక్తులు నిరసనలో పాల్గొన్న ఓ విద్యార్ధిని పై లైంగిక దాడికి దిగడం క్యాంపస్ లో దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ సంఘటన ఒకరకంగా విద్యార్ధులను బెదిరించడమే అని మనవ హక్కుల సంఘాలు, విద్యార్ధి సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్లూ లో చోటుచేసుకున్న పరిణామాలపై జాతీయ మహిళా కమిషన్ తెలంగాణా డిజిపి అంజనీ కుమార్ ని ఆదేశించింది. లైంగిక వేధింపులు జరుగుతున్నట్టు వస్తున్న ఆరోపణలపై పూర్తీ స్థాయి విచారణ జరపాలని సూచించింది. ఈ నెల 17వ తేదీ రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. క్యాంపస్ లో రోజురోజుకీ చేయిదాటుతున్న వ్యవహారాలను కేరళకు చెందిన రాజ్యసభ సభ్యులు శివదాసన్ మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇఫ్లూ లో ఆడపిల్లలకు భద్రత లేకుండా పోవడం సిగ్గుచేటని శివదాసన్ వ్యాఖ్యానించారు. ఇఫ్లూ లో నెలకొన్న వివాదాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిస్థితులను చక్కదిద్దాలనే డిమాండ్ వినిపిస్తోంది. విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నట్టు కొందరు అధికారులను మార్చాకపొతే విద్యార్ధినులు నష్టపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.