జకీర్, సీనియర్ జర్నలిస్టు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు జరిగిన పవన్ కళ్యాణ్ సభ ద్వారా ఒక నూతన సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు పంపించాడు. ఇందులో ఎక్కువగా బాధపడేది చంద్రబాబు నాయుడే., కారణం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్నా చంద్రబాబు కోరికల మీద నీళ్లు పోయకపోగా పవన్ కళ్యాణ్ నిప్పులు పోశాడు. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో పాలన వస్తుంది అనే మాట మాట్లాడడం ద్వారా చంద్రబాబు ఆశలు అడియాసలు అయ్యాయి.ఇన్ని రోజులు అటు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకులు మాకు పవన్ కళ్యాణ్ మద్దతుతో ముఖ్యమంత్రి పదవి వచ్చేసింది, అని ఊహల్లో ఉన్న వారికి పవన్ కళ్యాణ్ మాటలు శరాఘతం అయ్యాయి. తాజా రాజకీయ అంచనాల ప్రకారం 2024లో వైఎస్సార్సీపి ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఒకవైపు జనసేన బిజెపి ఒకవైపు పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు కళ్యాణ్ మీటింగ్ ద్వారా కనిపిస్తున్నాయి. ఒకటికి రెండుసార్లు పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి అయితాను అనే పదము వాడడం ద్వారా చంద్రబాబు నాయుడు ఆశలు గల్లంతు. జనసేన బిజెపి స్ట్రాటజీ ప్రకారం ఈ ముగ్గురు పోటీలో ఒకవేళ హంగు వచ్చే పక్షంలో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసి ఆంధ్రప్రదేశ్లో బిజెపి అధికారాన్ని చలాయించాలి అనేది వారు ఎత్తుగడ.ఎన్నో ఆశలు పెట్టుకున్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అలాగే ఎల్లో మీడియా కూడా ఈరోజు ఉదయమే అటువంటి సమాచారం వచ్చిందో ఏమో అచ్చం నాయుడు తోటి బిజెపి పార్టీ మీద విమర్శలు చేయించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు రాజకీయ విధానం దేహి అనే పద్ధతిలో ఉంటే కనీసం అలయన్స్ తోటి నారా లోకేష్ కి ఉపముఖ్యమంత్రి పదవిని అడిగి రాజకీయాలనుంచి నిష్క్రమించే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మీటింగ్ మాత్రం చంద్రబాబు నాయుడుకి రాజకీయ జీవితంలో ఏ రోజు బిజెపి ఇటువంటి సూత్రం పాటిస్తుందని కలలో కూడా ఉహించక పోవచ్చు.