ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రధానినరేంద్ర మోడీ ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదనంలో జరిగిన ‘మాదిగల విశ్వరూప మహాసభ’లో మోడీ మాట్లాడారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వప్నాన్ని తాము నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. వర్గీకరణకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందని, దానికి తాము మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. మాదిగల ఉద్యమాన్ని గుర్తించానని, గౌరవిస్తున్నానని హామీ ఇచ్చారు. దళిత వర్గాలకు క్షమాపణ చెప్పడానికే మాదిగల సభకు వచ్చానని ప్రధాని మోడీ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు దళితులను మోసం చేశాయని, మాదిగల సమావేశానికి ఏ ప్రధాని హాజరు కాలేదని గుర్తు చేశారు. అణగారిన వారి నుంచి ఏదో ఆశించి ఇక్కడికి రాలేదని మోడీ స్పష్టం చేశారు.దశాబ్దాలుగా ప్రభుత్వాలు వర్గీకరణ చేయకుండా వారిని మోసం చేస్తున్నాయని, న్యాయ పరమైన చిక్కులు రావడంతో మోడీ గొప్ప మనసులో ఈ సారీ చెప్పడం గమనార్హం.