విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ముంబై వాంకడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్ సెమీస్ పోరులో కోహ్లీ సెంచరీ చేసి వన్డేల్లో 50వ శతకం పూర్తి చేశాడు. విరాట్ 106 బంతుల్లో , 100 రన్స్ చేసి సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో వన్డేల్లో సచిన్ 20౦౩ వ సంవత్సరంలో నమోదు చేసిన అత్యధిక శతకాల (49) రికార్డును విరాట్ బద్దలకొట్టాడు. ఇరవై ఏళ్లుగా భారత్ పేరిట ఉన్న రికార్డుని మళ్ళి భారత ఆటగాడే తిరగరాయడం విశేషం.
అంతేకాదు, ఒకే ప్రపంచ కప్పు పోటీలో అత్యధిక పరుగులు చేసిన హీరోగా కూడా మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. 2౦౦౩ ప్రపంచ కప్పు పోటీలో సచిన చేసిన 673 పరుగులు చేయగా, ఈ ప్రపంచ కప్పు టోర్నీలో కోహ్లి 711 పరుగులు చేసి సచిన్ ని అధిగమించాడు.