stadiam

సందడి షురూ…

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ , ఆస్ట్రేలియా మధ్య రేపు జరుగనున్న ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో ప్రదర్శించాల్సిన ఎయిర్ షో కోసం భారత వైమానిక దళం రిహార్సల్ నిర్వహించింది. ఈ ముందస్తు ప్రదర్శనలో సూర్య కిరణ్ ఏరోబాటిక్ సభ్యుల బృందం పాల్గొంది.

Read Full News
kohli 100

క్రికెట్ లో “విరాట్”పర్వం…!

విరాట్ కోహ్లీ వ‌న్డే క్రికెట్లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ముంబై వాంకడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌ పోరులో కోహ్లీ సెంచ‌రీ చేసి వన్డేల్లో 50వ శ‌త‌కం పూర్తి చేశాడు. విరాట్ 106 బంతుల్లో , 100 ర‌న్స్ చేసి సెంచ‌రీ సాధించాడు. ఈ సెంచ‌రీతో వ‌న్డేల్లో స‌చిన్ 20౦౩ వ సంవత్సరంలో నమోదు చేసిన అత్య‌ధిక శ‌త‌కాల (49) రికార్డును విరాట్ బ‌ద్ద‌ల‌కొట్టాడు. ఇరవై ఏళ్లుగా భారత్ పేరిట ఉన్న రికార్డుని మళ్ళి భారత…

Read Full News
in new c

మహా సమరానికి ఒక్క అడుగు….

వన్డే వరల్డ్‌ కప్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో నాకౌట్‌ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. మొదటి నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్‌ సేన అదే ఊపుతో కివీస్‌ను ఓడించాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో బ్యాటర్లు అదరగొడుతుండగా బౌలింగ్‌లో పదునైన పేస్‌తో పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లను బెదరగొడుతున్నారు. స్పిన్నర్లు బ్యాటర్లను కట్టడి చేస్తుండగా ఫీల్డర్లు మైదానంలో చురుగ్గా కదులుతున్నారు. ఇలా ఎటు చూసినా ఏ విభాగంలో చూసినా టీమిండియా చాలా పటిష్టంగా…

Read Full News
maxwel

“మాక్స్ వెల్” మెరుపులు..

ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ప్రపంచ కప్పు మ్యాచ్ లో మరో సంచలన విజయం నమోదైంది. అఫ్గానిస్తాన్ పై ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మాక్స్ వెల్ 201 మెరుపు పరుగులతో డబుల్ సెంచరీ చేయడం విశేషం. ఒకవిధంగా చెప్పాలంటే మాక్స్ వెల్ ఒంటి చేతితో ఆటను గెలిపించారని చెప్పవచ్చు.

Read Full News
IMG 20231002 WA0029

ఎవరితో…ఎక్కడ…

ప్రపంచ కప్ క్రికెట్ దగ్గర పడింది. ఈ నెల 5వ తేదీ నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ పండగే. దేశంలోని వివిధ నగరాల్లో జరిగే ఈ ఆట కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ వేచి చూస్తున్నారు. ఏ దేశపు జట్టు ఎక్కడ ఎవరితో తలబడుతుందో తెలిపే టేబుల్ ఇది.

Read Full News