ప్రభుత్వంపై“భారాస”కుతంత్రం..?

brs stratgy

పదేళ్లుగా ఒంటెద్దు పోకడల ప్రభుత్వంలో పదవుల రుచి చూసిన భారత రాష్ట్ర సమితి నేతలు ఓడిపోయినా ఇంకా మేకపోతు గాభీర్యం ప్రదర్శించడం విమర్శలకు దారి తీస్తోంది. తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో భారాస నేతలు ఆ ప్రభుత్వాన్ని కూలదోస్తామనే ధోరణిలో ఆలోచనలు చేయడాన్ని రాజకీయ పరిశీలకులే కాదు సామాన్య ప్రజలు సైతం ఖండిస్తున్నారు. రాజకీయాల్లో అనుభవం ఉన్న భారాస నేత కడియం శ్రీహరి కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ.లను తమ వైపు తిప్పుకోవడం పెద్ద కష్టం కాదని, ఏడాదిలో భారాస పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వ్యాఖ్యానించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. భారాసకు ఎలాగో మజ్లిస్ పార్టీ మద్దతు ఉన్నది కాబట్టి, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న బిజెపి ఎం.ఎల్.ఎ.లతో పాటు మరో పదిమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను తమ వైపు రాబట్టుకోవడం పెద్ద  పనేమీ కాదని కడియం కడియం విశ్లేషించడం పట్ల కాంగ్రెస్ పార్టీ మండి పడుతోంది. దీన్నిబట్టి చుస్తే కొత్త ప్రభుత్వంపై కుట్ర వ్యూహాలు మొదలయినట్టు కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. భారాస పార్టీ అగ్రనేతల ప్రోత్బలంతోనే కడియం శ్రీహరి ఇలాంటి ప్రకటనకు ఒడిగట్టి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయంపాలై  తెలంగాణ ప్రజలకు ముఖం చూపకుండా రాత్రికి రాత్రే ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌసేకి మకాం మార్చిన మాజీ ముఖ్యమంత్రి  తన పార్టీ నేతలను ఇలాంటి కుతంత్ర ఆలోచనలతో పురిగొల్పడం సమంజసం కాదని పలుఫురు కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎం.ఎల్.ఎ.ల బలంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని39 మంది ఉన్న ఎం.ఎల్.ఎ.లతో ఎలా కూలుస్తారని, అసలు కడియం శ్రీహరికి ఆ ఆలోచన రావడమే నేరమని పేర్కొంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాన్ని కుల్చాలనే ఆలోచన రావడం విద్రోహక చర్యకంటే ప్రమాదకరమని ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. భారాస కుతంత్రపు ఆలోచనలను విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపారు.  తెలంగాణ ప్రత్యక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారాన్ని చేజిక్కిచ్చుకున్న భారాసకు ఇతర పార్టీల నుంచి ఎం.ఎల్.ఎ.లను ఎలా లొంగదీసుకుందో తెలంగాణ ప్రజలకు తెలియని సంగతి కాదని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కడియం శ్రీహరి ప్రకటనను తేలికగా తీసివేయవద్దని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *