ఎన్నుకోలేదు..దిగిపోండి..!

jnj

హైదరాబాద్ లోని జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కేటాయింపులో జరుగుతున్న జాప్యం వల్ల జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులు మళ్లీ పోరుబాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాక, ప్రస్తుతం సొసైటీకి బాధ్యత వహిస్తున్న మేనేజింగ్ కమిటీ పై కూడా మెజారిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఎన్నికలు లేకుండా కొనసాగుతున్న కమిటీలోని వారు వెంటనే తప్పుకోవాలనే బలమైన డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికె కొందరు రాజీనామా చేసినట్టు సమాచారం అందుతున్నప్పటికీ మేనేజింగ్ కమిటీ మొత్తం తప్పుకోవనే సభ్యులు పేర్కొంటున్నారు. నగరంలోని నిజాంపేట్, పేట్ బషిరాబాద్ లలో సొసైటీకి కేటాయించిన భూములను సొసైటీకే అప్పజెప్పాలని గత ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం పూచిక పుల్లతో పక్కన పెట్టిన సంగతి తెసిసిందే. దీంతో సొసైటీ లోని కొందరు సభ్యులు పోరుబాట పట్టారు. న్యాయపోరాటంలో భాగంగా వివిధ పార్టీల నేతలను, ప్రజా సంఘాల నాయకులకు కలిశారు. డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన తమ స్టలాలను వెంటనే సొసైటీకి బదిలీ చేయాలని రోడ్డుకేక్కారు.

jnj nizmpt 4

ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి హయంలో కేటాయించిన ఆయా స్థలాలను సుప్రీం కోర్టు అదేశానుసారం న్యాయ పరంగా సొసైటీకి బదలాయించాల్సిన కెసిఆర్ ప్రభుత్వం నిమ్మకునిరేత్తినట్టు వ్యవహరించింది. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ముందు ఉంచి నిలదీయాల్సిన సొసైటీ పలక వర్గం అధికారుల అండదండలతో సభ్యులను మభ్యపెడుతూ వచ్చిందని సొసైటికి చెందిన కొందరు సభ్యులే బహిరంగంగా వెల్లడించారు. ఎలాంటి ఎన్నిక లేకుండా సొసైటీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న మాజీ ఎం.ఎల్.ఎ. క్రాంతి కిరణ్ పట్ల సొసైటీ సభ్యులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. క్రాంతి కిరణ్, పల్లె రవికుమార్ తమ పదవులను అంటిపెట్టుకోవడానికి ఇంటి స్థలాల సమస్యను పక్కదోవ పట్టిస్తున్నరనే బలమైన ఆరోపణలు బయటకు వచ్చాయి. జర్నలిస్టుల బాగోగులు చూడాల్సిన మీడియా లేదా ప్రెస్ అకాడమి సైతం ప్రభుత్వానికి వత్తాసు పలకడం కూడా సొసైటీ సభ్యులకు నచ్చలేదు. అనుభవం, బాధ్యత కలిగిన అల్లం నారాయణ వంటి అకాడమి ఛైర్మన్ “ఒంటేద్దు పోకడ” ప్రభుత్వం నిర్మించిన అకాడమీ భవనాన్ని ప్రారంభించే ద్గైర్యం చేయలేక పోవడం ఆయన నిస్సహాయతకు నిలువెత్తు నిదర్శనంగా మిగిలింది. ఎన్నికల ముందు కెసిఆర్ ఈ భవనాన్ని ప్రారంభించి న్యాయం చేకూరే ప్రకటన చేస్తారని జర్నలిస్టులు కొండంత ఆశతో వేచి చూశారు. కానీ, అదీ జరగలేదు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కెసిఆర్ నోటి నుంచి ఆయన చింతమడక దారిపట్టే వరకు కూడా ఒక్క ప్రకటన రాలేదు. తీర్పు వచ్చిన తర్వాత సరైన నిర్ణయాలు తీసుకోలేని అప్రకటిత కమిటి వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. తము చేస్తున్న పోరాటానికి అడుగడుగునా అడ్డుపడుతున్న కమిటీ తాజాగా ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో సభ్యులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని కొందరు సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో ధర్నాలు, నిరసనలు తెలిపినప్పుడుకెసిఆర్ కి అలాంటి కార్యక్రమాలు అంటే నచ్చవని, దానివల్ల ప్రయోజనం ఉండదని సభ్యులను హెచ్చరించిన కమిటీ నేతలే ఇప్పుడు పంధా మార్చడం మెజారిటీ సభ్యులకు మింగుడు పడడంలేదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అప్రకటిత కమిటీ వద్దనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. సభ్యుల ప్రమేయం లేకుండా కొనసాగుతున్న ఈ కమిటీ పై సహకార శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని మెజారిటీ సభ్యులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఈ నెల 21వ తేదీన కమిటితో సంబంధం లేకుండా సొసైటి సభ్యులు రవీంద్ర భారతి ఆడిటోరియంలో సమావేశం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *