సాల్యూట్ “కెప్టెన్”….

vijay

ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్​కాంత్​(71) కన్నుమూశారు. తమిళనాడులోని చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా తమిళ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. విజయ్​కాంత్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విజయ్​కాంత్‌ గత కొన్నాళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

vijay staln

గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి కారణంగా విజయకాంత్‌ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నెలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు జలుబు, దగ్గు ఎక్కువగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు.ఆ సమయంలో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో నవంబర్‌ 23న విజయకాంత్‌ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యానికి బాగా సహకరిస్తున్నారని డాక్టర్లు తెలిపారు. చికిత్స అనంతరం ఈనెల 11న విజయ్ కాంత్​ను డిశ్చార్జి చేశారు. ఇటీవలే డీఎండీకే వర్కింగ్‌ కమిటీ సాధారణ సమావేశాల్లో కూడా విజయ్​కాంత్​ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆస్పత్రిలో చేరారు. కరోనా సోకినట్లు డీఎండీకే ప్రధాన కార్యాలయం గురువారం ఉదయం ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత ఆయన మరణించినట్లు ప్రకటించింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సినీ ప్రముఖులు విజయ్ కాంత్ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *