కాటేస్తున్న”కోబ్రా”…!

kobra

“కోబ్రా” పేరు వింటేనే ఒళ్ళు జలతరిస్తుంది.ఎందుకంటే అది ఒక ఆఫ్రికా ఖండంలో కనిపించే భయకరమైన సర్పం.అది కాటు వేస్తే కాటికి వెళ్ళవలసిందే.అది సర్పాలకు రారాజు. కాలకూట విషాన్ని చిమ్మే విషసర్పం. బయో ఉత్పత్తులను తయారు చేసే దేవగాన్ కంపెనీ “కోబ్రా” బ్రాండ్ పేరుతో ఒక బయో ఉత్పత్తిని తయారు చేసి మార్కెట్ లోకి వదిలిందే ఆ కోబ్రా…కౌలురైతును కాటు వేసింది.ఆ దెబ్బతో రైతు అప్పులు పాలైయాడు. రాజులాగా బ్రతకలసిన ఓ కౌలురైతు ప్రైవేటు వెహికిల్ కు డ్రైవర్ గా మారాడు.

kandi

కోబ్రా దెబ్బతో సాగు వదలి సాగిలపడి పోయాడు. ఈ కంపెనీ హైదరాబాద్ లో నిజాంపేట్ లో ఉందని అడ్రాసును బాటిల్ పై ముద్రించారు. ఈ కంపెనీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారంలో భాగంగా ప్రకాశం జిల్లా, ఇంకొల్లు మండలం, కొణికి గ్రామంలోగల ఎరువులు, పురుగు, మందులు, విత్తనాలు అమ్మే తేజ ఆగ్రోట్రేడర్స్ పేరుగల డీలర్ కు ఇచ్చారు. నరసరావుపేటకు చెందిన కౌలురైతు జరుగుల ఆంజనేయులో( సొంత గ్రామం ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం కొణికి దగ్గర దుద్దుకూరు) 2019 సంవత్సరం నవంబర్ నెలలో కంది పంటకు తెగులు వచ్చిందని తేజ ఆగ్రో ట్రేడర్స్ యాజమాని రామకృష్ణను అడగగా “కోబ్రా “బయోమందును లీటరు రూ.2400 చొప్పున లక్ష రూపాయల విలువైన కోబ్రాను బయో మందను ఇచ్చి పిచికారి చేయమని సలహా ఇచ్చాడు.ఈ కోబ్రా బయో మందును తాను కౌలుకు చేస్తున్న (ఉప్పలపాడు గ్రామంలో) 92 ఎకరాల్లో పిచికారి చేశారు.పిచికారి చేసిన వారం రోజుల్లోనే కంది పంట అంతా దెబ్బతినిపోయింది. ఈ మార్పును గమనించిన కౌలురైతు ఆంజనేయులు నరసరావుపేట మండల వ్యవసాయశాఖ ఆఫీసర్ కు తెలియజేశారు.వ్యవసాయ ఆధికారి గుంటూరులో ” లాం” ఫామ్ సైంటిస్టులకు తెలియజేయగా ప్రొఫెసర్ రాజమణి (సైంటిస్ట్ )వ్యవసాయ అధికారులతో కలసి కంది పంటను పరిశీలించారు. కంది పంటను దెబ్బ తినటానికి కారణం కోబ్రా బయో ముందు కాదని వాతావరణంలో వచ్చిన మార్పులని,భూమిలో తేడా ఉందని కంపెనీకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారు.తన పోలం చుట్టు ఉన్న ఇతర రైతుల కందిపంట బాగానే ఉంది.తన పంట ఎందుకు ఎండి పోయింది అని సైంటిస్ట్ ఆలా ఎందుకు రిపోర్టు ఇచ్చాడని రైతు బుర్రలో ఆలోచన వచ్చింది.ఎందుకు అలా ఆ సైంటిస్ట్ రిపోర్టు ఇచ్చాడని ఆరా తీయగా తేజ ఆగ్రో ట్రేడర్స్,నరసరావుపేట వ్యవసాయ ఆధికారి, కంపెనీ యాజమాన్యం కుమ్మక్కై సైంటిస్ట్ కు లంచాలు ఇచ్చి తప్పుడు రిపోర్ట్ వ్రాయించారని తేలిసింది. కౌలురైతు అంజనేయులు దిక్కుతోచని పరిస్థితిలో గుంటూరులో కన్జ్యూమర్ కోర్ట్ ను ఆశ్రయించారు. కన్జ్యూమర్ కోర్టు అన్ని వివరాలను పరిశీలించి రూ.9.40 లక్షలు నష్ట పరిహారం దేవగన్ కంపెనీ,తేజ ఆగ్రో ట్రేడర్స్ ఇరువురు కలిసి జరుగుల ఆంజనేయులకు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అమలు చేయడంలో ఇరువురు నిర్లక్ష్యం చేశారు. కన్జ్యూమర్ కోర్టు వారు లెటర్ ద్వారా ఆదేశాలను కంపెనీ దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తే ఆ కంపెనీ లేదని ఎన్ని లేటర్ల పంపించిన తిరిగి వస్తున్నాయి. తేజ ఆగ్రో ట్రేడర్స్ వారిని అడిగితే వాళ్ళు ఎవరో నాకు తెలియదని సమాధానం చెబుతున్నారు.మరోవైపు నేను ఒక్కడే డబ్బులు చెల్లించ లేనని కంపెనీ కూడా చెల్లించవలసి ఉంటుందని అంటూనే ఆ కంపెనీ ఎక్కడుందో నాకు తెలియదు అని చెప్పటం పచ్చి బూటకం.ఈ విధంగా కొన్ని, బయో ఉత్పత్తులు చేసే కంపెనీలు, రసాయన మందులు తయారు చేసే సంస్థలు రైతులను మోసం చేస్తున్నాయి.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఒక కంపెనీ అయితే హైకోర్టు లైసెన్స్ ఇచ్చిందని నున్న దగ్గరలోగల సూరంపల్లి ఇండస్ట్రీయల్ ఏరియాలో ఉన్నకంపెనీ బ్రోచర్ మీద ప్రింటు చేసుకుని బయో ఉత్పత్తులు అమ్మడం దగాకోరుతనానికి నిదర్శనం.
రాష్ట్ర ప్రభుత్వం భాద్యత తీసుకుని కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేయాలి. నష్ట పోయిన కౌలురైతు అంజనేయులకు రూ.9.40 లక్షలు వెంటనే చిల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దేవగన్ లాంటి కంపెనీలు ప్రభుత్వం నుండి లైసెన్స్ తీసుకోకుండా,ఎటువంటి శాస్త్రీయ ఫార్ములేషన్ లేకుండా బయో ఉత్పత్తులను తయారు చేసి రైతులను మోసగిస్తున్నారు. కోట్లాది రూపాయలు గడించి న్యాయస్థానానికి దొరకుండా పారిపోతున్నారు. చివరికి నష్టపోతున్నది రైతులు,కౌలు రైతులే .తేజ ఆగ్రోట్రేడర్స్, సైంటిస్టులు,కంపెనీ యాజమాన్యం మాత్రం సుభిక్షంగా ఉన్నారు. కష్టమైన, నష్టమైనా సాగు చేసి పంటల పండిస్తున్న రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి.రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి.

సౌజన్యం…

పి.జమలయ్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *