పార్లమెంట్ ఎన్నికల కోసం భారత ఎన్నికల కమీషన్ పెద్దఎత్తున సన్నాహాలు చేస్తోందని భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎస్ హెచ్ రాజీవ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల నిర్వహణకు ఇంకా ఏమి చేయాలనే దానిపై వాటాదారులతో సమీక్ష, సంప్రదింపుల కోసం తొలిగా ఆంధ్రప్రదేశ్ ను సందర్శించామన్నారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న భారత ఎన్నికల కమీషన్ బృందం గత 3 రోజులుగా అన్ని రాజకీయ పార్టీలు, కలెక్టర్లు, ఎస్పీలు మరియు సిఎస్, డిజిపితో సహా ప్రభుత్వ సీనియర్ అధికారులతో సమావేశాలు నిర్వహించింది. రాష్ట్ర పర్యటన బుధవారం ముగిసిన నేపథ్యంలో సీఈసీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. 2024లో ఉత్తమమైన ఎన్నికల వాతావరణాన్ని దేశానికి అందించాలన్నదే తమ ధ్యేమమని ఈ సందర్భంగా సిఇసి స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్‌తో కలిపి 2024 లోక్‌సభకు సాధారణ ఎన్నికల కోసం ఎన్నికల సంసిద్ధతను సమీక్షించామన్నారు. పారదర్శకమైన ఎన్నికల జాబితా, స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాజకీయ పార్టీలు లేవనెత్తే అన్ని అభ్యంతరాలను ఇసి పరిష్కరిస్తుందన్నారు. భారత ఎన్నికల సంఘం అన్ని పార్టీలకు తగిన ప్రాధన్యత ఇస్తుందని, తదనుగుణంగా అధికారులను నిర్దేశిస్తుందన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కఠినమైన చర్యల కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, జిల్లా పరిపాలనా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. తుది ఎన్నికల జాబితాను జనవరి 22న విడుదల చేస్తారు. మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, అందులో 2.07 మంది పురుషులు, 1.99 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే 5.8 లక్షల మంది ఓటర్లు తమ ఇంటి నుండే ఓటు వేసే వెసులుబాటు కల్పించారు. రాష్ట్రంలో దాదాపు 7.88 లక్షల మంది మొదటి సారి ఓటర్లు, 100 ఏళ్లు పైబడిన 1174 మంది ఓటర్లు ఉన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ , ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య బద్ధంగా..
