తెలంగాణాలో ఎన్నికల అనంతరం అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) వ్యవహార తీరు పై “తగ్గని ఒంటెద్దు దూకుడు…” అనే శీర్షికన “ఈగల్” న్యూస్ పోస్ట్ చేసిన కథనం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశ మైంది. ఎన్నికల్లో ఓటమికి ప్రజలే కారకులు అన్నట్టు బి.ఆర్.ఎస్. నేతలు మాట్లాడడం సమంజసం కాదని “ఈగల్” చేసిన సూచన పై పార్టీ ఉన్నత స్థాయి నేతల్లోనూ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పార్టీ శ్రేణులకు కీలక సందేహం పంపడం గమనార్హం. తెలంగాణ భవన్ లో జరిగిన భువనగిరి లోక్ సభ నియోజక వర్గ పార్టీ సమీక్ష సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ ఓటమికి సంబంధించి కారణాలు వెతకాలే కానీ ఇకపై ప్రజలను తప్పు పట్ట వద్దని పేర్కొన్నారు. కాంగ్రెస్ హమీలను ప్రజలు గుడ్డిగా నమ్మడం వల్లే ఆ పార్టీ గెలిందని కొద్ది రోజులుగా బి.ఆర్.ఎస్. నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయన్ని ప్రధాన అంశంగా తీసుకొని ఓడిపోవడానికి ప్రజలే కారణం అని ప్రచారం చేయడం సరికాదు అంటూ “ఈగల్ “న్యూస్ విశ్లేషణాత్మక కథనాన్ని పోస్ట్ చేసింది. ఈ వాస్తవాన్ని బి.ఆర్.ఎస్. గమనించి దిద్దుబాటు చేసుకోవడానికి ఉపక్రమించడం విశేషం.
“ఈగల్ “ఎఫెక్ట్ ….
