“భోగం” మరచిన “ఆడబిడ్డ”..!
భారత రాష్ట్ర సమితి (భారాస) పార్టీలో దాదాపు తిరుగుబాటు నాయకురాలిగా ఎదుగుతున్న కెసిఆర్ కుమార్తె, ఎం.ఎల్.సి. కవిత దూకుడు ఇటు తెలంగాణ జనంలోనూ, అటు వివిధ రాజకీయ వర్గాల్లోనూ రకరకాల ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. పార్టీ చెట్టు నీడలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించి, అంతులేని అధికారాన్ని అనుభవించిన కవిత పదేళ్ల పాటు “ఆవేదన” అనుభవించినట్టు వెల్లడించడం ఒకింత విడ్డూరంగా కనిపిస్తోంది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఆడంబరం ఏ స్థాయిలో వెలుగొందనే గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. భారాస అధికారంలో…
