తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.)పార్టీ తన మనుగడను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్టు కనిపిస్తోంది. బి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలో ఉన్నపుడు వివిధ రంగాల్లో వాటిల్లిన వేల కోట్ల రూపాయల నష్టం, అప్పులు, చెల్లింపులు, అవినీతి కాంట్రాక్టుల నిగ్గుతేల్చి పరిపాలనను గాడిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న కొత్త ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిందుకు అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడలు వేయడం అంతుపట్టకుండా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కెసిఆర్ పదేళ్ళ పాలనలో జరిగిన కాళేశ్వరం బ్యారేజి సమస్య, విద్యుత్తు కొనుగోళ్ళలో రెట్టింపు చెల్లిపులు, పబ్లిక్ సర్వీసు కమిషన్ లో పేపర్ లీకేజీలు, దరణి పోర్టల్ లో పొంతన లేని నియమ, నిబంధనలు, వరంగల్ ఆసుపత్రి భావన నిర్మాణం నిధుల గోల్ మాల్, ఫార్ములా “ఇ” పేరిట 50 కోట్ల లెక్కా పత్రం లేని చెల్లిపులు తదితర కీలక వ్యవహారాలలో దాగి ఉన్న వాస్తవాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటికు తీసే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా అంశాలను పక్కదారి పట్టించి ప్రజల దృష్టిని మళ్ళించే విధంగా బిఆర్ఎస్ వ్యవహరించడం గమనార్హం. సుమారు 25 రోజులుగా బిఆర్ఎస్ కీలక నేతలు చేస్తున్న ప్రకటనలు, ప్రసంగాలలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంటున్నారు. ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఆచరణలోకి తీసుకు రావడానికి ఇంకా దాదాపు 50 రోజుల గడువు ఉన్న సంగతి అందరికీ తెసిసిందే. కానీ, ఈ హామీలను ఉన్న ఫణంగా అమలు చేయాలని కెటిఆర్ వంటి అనుభవం ఉన్ననేతలు జనాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయడం సమంజసం కాదనే సూచనలు వస్తున్నాయి.
ఆరు గ్యారంటీలను అమలు చేసేంత వరకు వెంట పడాలని, కరెంటు బిల్లులు చెల్లించ వద్దని, అధికారులను నిలదీయాలని కేటిఅర్ ప్రజలకు పిలుపు ఇవ్వడం సంఘ వ్యతిరేక శక్తులను ప్రేరేపించే చందంగా ఉందనే ఘాటైన విమర్శలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నలోక్ సభ నియోజక వర్గాల బిఆర్ఎస్ నేతల సమీక్ష సమావేశాల్లో కేటిఅర్, ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో సమస్యలే లేనట్టు ఆరు గ్యారంటీల పైనే తమ పోరాటం అన్నట్టు వ్యవహరించడం విస్మయ పరుస్తోందని వివిధ రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయ పడుతున్నారు. కొత్త ప్రభుత్వంపై ఏదో రూపంలో ఒత్తిడి పెంచేందుకు బిఆర్ఎస్ కీలక నేతలు వ్యూహ రచన చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారానే వెల్లడవుతోంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నందున తమ పట్ల విశ్వసనీయత కోల్పోయిన ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈ తరహా పద్ధతులను అవలంభిస్తోందనే సమాచారం అందుతోంది. తెలంగాణ తెచ్చినందుకు తమను 100 మీటర్ల లోతులో బొంద పెడతారా అని కేటిఅర్ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మరచిపోయి కేటిఅర్ ఇష్టానుసారంగా మాట్లాడడం సమంజసం కాదని పేర్కొంటున్నాయి.

ఇక తాజాగా బిఆర్ఎస్ ఎం.ఎల్.సి. కవిత శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో “మాహాత్మా జ్యోతీరావు ఫూలే” విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇవ్వడం మరో చర్చకు దారి తీసింది. పదేళ్ళ పాటు శాసన సభ ప్రాంగణాన్ని తమ చేతుల్లో ఉంచుకొని తిరుగులేని అధికారాన్ని చెలాయించిన బిఆర్ఎస్ తన హయంలో జ్యోతీరావు ఫూలే విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయిందనే వాదనలు బయటకు వస్తున్నాయి. జ్యోతీరావు ఫూలే వంటి మహాననీయుడిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉండని,అయితే కొత్త ప్రభుత్వం అనేక దిద్దుబాటు చర్యల్లో ఉన్నవిషయం తెలిసి కూడా బిఆర్ఎస్ ఇలాంటి సున్నితమైన విషయాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేయదాన్నిబట్టి వారి వ్యూహాలు అర్ధమవుతున్నాయని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నందున ఏదో రకంగా రాష్ట్రంలో తిరిగి ఎంతో కొంత పట్టు సాధించుకోవడానికి బిఆర్ఎస్ నేతలు ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. ఆ పార్టీ లేవనెత్తే స్సమస్యలు ప్రజలు ఆమోదించేవిగా ఉంటె బాగుంటుదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.