
పాలన అంటే “ప్రతీకారం”..!
ప్రజాస్వామ్యంలో రాజకీయం వేరు. పగ, కక్షలు, కార్పణ్యాలు వేరు. రాజకీయాలు అనేక లక్ష్యాలతో నాయకులు, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తాయి. కక్షలు వ్యక్తిగత వ్యవహారాలతో ముడిపడి పగతో రగిలిపోతున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే పార్టీలు ఏ రాజకీయం చేయాలనుకున్నా అవి రాజ్యాంగానికి కట్టుబడి తీరాలి. అదే కక్ష సాధింపునకు తెగించాలనుకుంటే నీతి, నియమాలతో గానీ, ఏ చట్టంతో గానీ పని లేదు. మూర్ఖపు ఆలోచనలతో వ్యూహాలు వేస్తే చాలు. నువ్వా…నేనా…అంటూ రోషాలు పెంచుకుంటూ బలం చూపుకుంటే అదే హీరోయిజం….