అటు చూడు..”క్యూ” షురూ…!

4 mlas

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్తగా అధికారంలో చేపట్టిన రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొద్ది రోజుల్లో కూలిపోతుందని భారత రాష్ట్ర సమితి (బి.అర్.ఎస్.) సీనియర్ నేతలు కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మంగళ వారం బి.అర్.ఎస్. అగ్ర నాయకత్వం విస్తుపోయే సన్నివేశం ఆవిష్కృతం అయ్యింది. ఆ పార్టీకి చెందిన నలుగురు శాసన సభ్యులు రేవంత్ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది. బి.అర్.ఎస్. కి చెందిన ఎం.ఎల్. ఎ.లు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక) , గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్ చెరు) , మాణిక్ రావు (జహీరాబాద్) రేవంత్ రెడ్డిని హైదారాబాద్ లోని అయన నివాసానికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ విషయం బయటకు తెలియగానే బి.అర్.ఎస్. అగ్రనాయకులు సహా ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాయి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బి.అర్.ఎస్. శాసన సభ్యులు కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నలుగురు ఎమ్మెల్యేల మాదిరిగానే మరికొంత మంది ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోలేదని, 2014లో టి.అర్.ఎస్. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇటువంటి వాతావరణమే కనిపించిందని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *