నెల ముందే... - EAGLE NEWS

నెల ముందే…

summer

తెలుగు రాష్ట్రాలలో అప్పుడే భానుడి ప్రతాపం చుర్రు మంటోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సారి ఎండలు ముందే రానున్నాయి అని, గత ఏడాది కంటే కూడా ఎండల ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, వాతావరణ శాఖ ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోమంటూ కొన్ని హెచ్చరికలను జారీ చేసింది. ఈ ఏడాది ఎండలు “బాబోయ్” అనేలా ఉంటాయని అంటుంది వాతావరణ శాఖ. ఎల్ నినో ప్రభావంతో ఈ సంవత్సరం చలి కాలం కూడా చాలా వేడిగా గడుస్తుంది. చలి కాలం పూర్తీ కావడానికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ వాతావరణం మాత్రం వేడిగా మారుతొంది. గత సంవత్సరంతో పోల్చితే చలి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.

ఈ ఫిబ్రవరి చివరి నుండి వేసవి కాలం మొదలు అవుతుంది అని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంతేకాదు గతం కంటే ఎక్కువ ఎండ ప్రభావం ఈ వేసవిలో ఉండనుంది అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మార్చి నెల మధ్య నుండి వేసవి మొదలు అవుతుంది. కానీ, ఈ సారి నెల ముందు నుండే అంటే ఫిబ్రవరి చివరి వారం నుండి వేసవి ప్రభావం కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీనంతటికీ కారణం వాతావరణ లో ఏర్పడిన ఎల్ నినో ఎఫెక్ట్ అని అంటున్నారు నిపుణులు. దీని వల్ల భూతాపం ఎప్పటికప్పుడు పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఈ వేసవిలో వడ గాల్పుల ప్రభావం చూపనుందని, వేసవి మొత్తంలో వేడి గాలులు కొన్ని సార్లు ప్రభావం చూపుతాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలు, వృద్దులా విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *