మళ్ళీ”హస్త”గతమే…

parlament

తెలంగాణలో అసెంబ్లీలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే “మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌” అభిప్రాయ సేకరణలో తేలింది. తెలంగాణ లోని 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ 10 సీట్లు గెలుచుకుంటుందని ఇండి యా టుడే తెలిపింది. కేసీఆర్‌ నేతృత్వం లోని బీఆర్‌ఎస్‌ కేవలం మూడు సీట్లే దక్కుతాయని, తెలంగాణలో ఎక్కువ సీట్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీకీ 3 సీట్లే వస్తాయని, మజ్లి్‌స్ కు యథా ప్రకారం ఒక్క సీటు లభిస్తుందని పేర్కొంది. బీఆర్‌ఎ్‌సకు 29.10, బీజేపీకి 21.10 ఓట్లు లభిస్తే కాంగ్రెస్ కు 41.20 మేరకు భారీగా ఓట్లు లభిస్తాయని ఈ పత్రిక అంచనా వేసింది. ఈసారి లోక్‌సభలో 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ తెలంగాణపై మరింతగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కిందటిసారి కన్నా ఈ సారి ఆ పార్టీకి ఒక సీటు తక్కువగానే వస్తుందని ఇండియా టుడే సర్వేలో తేలడం గమనార్హం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు 9 సీట్లు రాగా బీజేపీకి 4, కాంగ్రెస్ కు 3 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియా టుడే సంస్థ ఈ సర్వేను 2023 డిసెంబరు 15 నుంచి 2024 జనవరి 28 నడుమ నిర్వహించింది. అన్ని లోక్‌సభ సీట్ల పరిధిలో 35,801 మందిని ప్రశ్నించి ఈ నివేదిక విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *