కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధిల్లీలో భేటి అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ లోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హైదరాబాద్ శ్రీశైలం ఫోర్ లైన్ ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాదు కల్వకుర్తి రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయడం, రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అభివృద్ధి, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరువరుసల విస్తరించడం వంటి అంశాలపై చర్చించారు.