బీజేపీ కార్యకర్తలారా, ఇకపై ఎవరైనా బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉంటుందని చెప్పే వాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తాండూరులో కేంద్రమంత్రితో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన సంజయ్ పొత్తుపై మీడియాకు పదే పదే లీకులిచ్చే ఫాల్తు రాజకీయ నాయకులను సైతం చెప్పులతో కొట్టాలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోందన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని కాగ్, విజిలెన్స్, కేంద్ర నివేదికలు తేల్చినా కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు. అందుకు ప్రతిఫలంగా బీఆర్ఎస్ నేతలు సైతం గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని అసెంబ్లీలో నిలదీయలేదన్నారు. తాను బతికున్నంత వరకు ప్రజల పక్షాన, హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. హిందుత్వం గురించి మాట్లాడలేని రోజు రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు. 370 ఆర్టికల్ ను రద్దు చేయడంతోపాటు దేశాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతూ నవభారత నిర్మాణం కోసం పాటుపడుతున్న నరేంద్రమోదీకి 370 ఎంపీ సీట్లను బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు. కెసిఆర్ డిల్లీ వెళుతోంది కేవలం “విస్కీ” బాటిళ్లు తెచ్చుకోవడానికే అని వ్యాఖ్యానించారు.
“పొత్తు”అంటే చెప్పుతో కొట్టండి…
