బెయిల్ కోసం”కుమార”వ్యూహం…!

exam bail c

దేశంలో కోట్లాది మంది పిల్లలు విద్య కోసం ప్రైవేటు, ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉంటున్నారు. అక్కడే అన్ని సౌకర్యాలతో విద్యను అభ్యసిస్తున్నారు. కేవలం అధ్యాపకుల సూచనల మేరకే పరీక్షలకు హాజరవుతున్నారు. తల్లిదండ్రులే దగ్గరుండి పరీక్షలకు సిద్ధం చేయాల్సిన రోజులు సుమారు రెండు దశాబ్దాల కిందటే కనుమరుగు అయ్యాయి. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఇందుకు సాక్ష్యం. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో పిల్లల చదువు పై తల్లిదండ్రుల పాత్ర ఏ మేరకు ఉందనేది విద్యా రంగ పరిశీలకులకు తెలియని విషయం కాదు. అలాంటిది వందల కోట్ల రూపాయలతో మద్యం కుంభకోణంలో తీహార్ జైలు ఊసల వెనుక ఉన్న కల్వకుంట్ల కవిత బెయిలు కోసం కుమారుని పరీక్షలను సాకుగా చూపడం విస్మయం కలిగిస్తోంది. తెలంగాణను పదేళ్ల పాటు తిరుగు లేకుండా ఏలిన తాత, భర్త ,మామలు, ఇతర బంధు గణం ఉన్న కవిత బెయిలు కోసం కుమారుని పరీక్షలను అడ్డు పెట్టుకొని లబ్ది పొందాలని చూడడం పలు రకాల రాజకీయంగా విమర్శలకు దారి తీస్తోంది.

kavitha tihar

మద్యం కేసులో తనకు సంబంధం లేదనే అంశాలను వెతికి వాటిని కోర్టు దృష్టికి తీసుకెళ్లి బెయిల్ కోసం పోరాడాల్సిన కవిత చివరికి కుమారుని పరీక్షలను అడ్డుగా పెట్టుకోవాలని ప్రయత్నించడం విచారకరం అని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. తల పండిన న్యాయ కోవిదులు ఉన్న అత్యున్నత న్యాయస్థానం ముందు బెయిల్ కోసం కవిత చూపుతున్న కారణం సామాన్యులను సైతం ఆలోచనల్లో పడేస్తోంది. పిల్లలు ఉన్న అనేక మంది తల్లులు,తండ్రులు దేశంలోని వివిధ కారాగారాల్లో సంవత్సరాల తరబడి వివిధ రకాల శిక్షలు అనుభవిస్తున్నారు. వారిలో కొందరి పిల్లలు బంధువుల వద్ద, మరికొందరు ఆశ్రమాలు, వసతి గృహాల్లో ఉంటూ చదువు కొంటున్నారు. వాళ్ళలోనే ఎంతో మంది స్వయంగా పరీక్షలకు హాజరై మెరుగైన ఫలితాలు చూపుతున్నారు. కవిత బయటకు రావడానికి కుమారుని పరీక్షలను కోర్టు ముందుకు తీసుకురావడాన్ని మహిళా సంఘాలు సైతం విమర్శిస్తున్నాయి. మద్యం కేసులో బెయిలు రావడానికి అన్ని దారులు మూసుకు పోవడం వల్లే కవిత తెలివిగా కుమారుని పరీక్షలను వాడుకోవాలని ప్రయత్నిస్తోందని రాజకీయ, న్యాయ రంగ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. కేవలం పరీక్షల సాకుతో కవిత బెయిలు పొందితే రేపు ఇదే అంశం దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని కోర్టుల్లో “రిఫరెన్స్” గా మారే అవకాశం లేకపోలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రిమాండ్ లో ఉన్న నిందితులకు కుమారుడు,కుమార్తె పరీక్షలను పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేస్తే వివిధ జైళ్లలో ఉన్న అనేక మంది ఇదే బాటలో బెయిల్ పొందే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి వారు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం తలెట్టవచ్చనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ‘‘కవిత చిన్నకొడుకు ఒంటరిగా ఏం లేడు. 22 ఏళ్ల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారాని, కవితను ఆమె ముగ్గురు అక్క,చెల్లెళ్ళు ములాఖత్ అయ్యారని, అబ్బాయి చూసుకోవాడానికి కుటుంబ సభ్యులు ఉన్నారు. పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ అడుగుతున్నారు, కానీ పరీక్షల్లో కొన్ని ఇప్పటికే అయిపోయాయని, కవిత కుమారుడికి పరీక్షల పట్ల ఆందోళన ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదని ’’ అని ఈడీ తరపు న్యాయవాది వివరించారు. కవిత ఆలోచన మేరకే వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపుల రూపంలో ఇచ్చారమనీ, బుచ్చిబాబు ఫోన్ నుంచి డేటా రికవరీ చేశామనీ, ఆ డేటా ఆధారంగా కవితను విచరించినట్టు చెప్పారు. అంతేకాక, అరుణ్ పిళ్ళైతో కలిపి కవితను విచారించామని, అప్రూవల్‌గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కవిత బెదిరించారని ఈడి న్యాయవాది జోయబ్ హోస్సేన్ కోర్టుకు  వెల్లడించారు. దీన్నిబట్టి సోమవారం నాడు సుప్రీం కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *