అభివృద్ధి వ్యూహం…

IMG 20240602 WA0049

తెలంగాణ రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్‌ తెలంగాణ, ఓఆర్‌ఆర్‌ నుంచి రీజినల్ రింగ్‌ రోడ్డు ప్రాంతం వరకు సబ్‌ అర్బన్‌ తెలంగాణ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణ గా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు ప్రాంతాలకూ త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని ఆయన అన్నారు.

IMG 20240602 WA0023

పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. అధికారం లోకి వచ్చిన వెంటనే బానిస సంకెళ్లను తెంచి ప్రజా పాలనను అందిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చామని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామని వివరించారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ చిహ్నం ఆవిష్కరిస్తామన్నారు. మూసీ సుందరీకరణ పథకం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలతో పరివాహక ప్రాంతం ఉపాధి కల్పన జోన్ గా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే అభివృద్ధిలో రాజీ లేని కృషి చేస్తామని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపేలా అభివృద్ధి చేస్తామని రేవంత్ వివారించారు. “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” అంటూ సాగే కవి అందెశ్రీ రచనను తెలంగాణ రాష్ట్ర గీతంగా ముఖ్యమంత్రి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *