తిరుమల తిరుపతి దేవస్థానానికి లక్ష రూపాయల విరాళం చెల్లించడం వల్ల భక్తులకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయని టిటిడి అధికారులు తెలిపారు. ఎప్పటి నుంచో ఈ వెసులు బాటు ఉన్నప్పటికీ ఆ ప్రయోజనాలను మరోసారి వివరించారు. దేవస్థానానికి విరాళంగా లక్ష రూపాయలు చెల్లించే దాత, అతని,ఆమె కుటుంబ సభ్యులకు సంవత్సరంలో ఒక రోజుకు అద్దె చెల్లింపు ప్రాతిపదికన సంవత్సరంలో ఒక రోజుకు అద్దె చెల్లింపు ప్రాతిపదికన (5 గురు సభ్యుల వరకు) రూ.100 గది కేటాయించబడుతుంది. కుటుంబ సభ్యులు (5 గురు సభ్యులు) దర్శనం ద్వారా సుపధం మార్గం ద్వారా ప్రవేశానికి అర్హులు, ఇది కూడా సంవత్సరానికి ఒకసారి. ఏడాదికి ఒకసారి దాతకు 6 చిన్న లడ్డూలు అందజేస్తారు. అదేవిధంగా బహుమానంగా, ఒక దుప్పట్ట, ఒక జాకెట్ ముక్కను దాతకు అందిస్తారు. ఇది కూడా సంవత్సరానికి ఒకసారి. ఈ ఐదు పే సౌకర్యాలు దాతకు జీవితకాలం వర్తిస్తాయి. అంతేకాక , చెల్లించిన మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుందని టిటిడి పేర్కొంది.