విద్యార్థులను సస్పెండ్ చేస్తూ హైదారాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.ఎఫ్.ఐ.) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సుకూన్ ఫెస్టివల్, విద్యార్థుల సమస్య లపై ప్రశ్నించినందుకు విద్యార్థులను సస్పెండ్ చేయడం పట్ల విద్యార్థి సంఘ నేతలు మండి పడ్డారు. సుభాషిని, నికిత్, రిషికేష్, పంకజ్, అజయ్ లను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ, 10 వేల రూపాయల జరిమాన విధించడాన్ని విద్యార్థులు ఖండించారు.

సెంట్రల్ యూనివర్సిటీ వీసీ, అడ్మినిస్ట్రేటర్ లు బిజెపి గవర్నమెంట్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నరన్నారని ఆరోపించారు. యూనివర్సిటీ యజమాన్యం ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో విద్యార్థుల పై కేసులు కూడా నమోదు చేయడం దారుణం అన్నారు. వెంటనే విద్యార్థులపై పెట్టిన సస్పెన్షన్ ను విరమించుకొని, పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసును కూడా ఉపసంహరించు కోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ధర్నా కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు అతిక్ హమద్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.